|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రదీప్ రంగనాథన్ సంచలనం: బ్లాక్ బస్టర్ సీక్వెల్ తో మరోసారి బాక్సాఫీస్ షేక్! 300 కోట్లు ఖాయమా?

Published: 23-02-2026, 2:35 AM
ప్రదీప్ రంగనాథన్ సంచలనం: బ్లాక్ బస్టర్ సీక్వెల్ తో మరోసారి బాక్సాఫీస్ షేక్! 300 కోట్లు ఖాయమా?
  • ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీకి సీక్వెల్ రాబోతుంది.
  • డైరెక్టర్ అస్వత్ సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
  • డ్రాగన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • ప్రదీప్ గతంలో కోమలి, లవ్ టుడే చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం డ్రాగన్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అస్వత్ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. దీనితో ప్రదీప్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డ్రాగన్ సీక్వెల్: ప్రదీప్ రంగనాథన్ సన్నాహాలు

Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదట డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి.. ఈ క్రమంలో ప్రదీప్ నెక్స్ట్ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆయన రీసెంట్ గా నటించిన డ్యూడ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన గతంలో నడిచిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్ గా రాబోతుందని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఆ మూవీ ఏది? హీరోయిన్ ఎవరు? సినిమా గురించి పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కాయదులోహర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం డ్రాగన్.. బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతే కాదు ఈ చిత్రం తర్వాత ప్రదీప్ రంగనాథన్ తమిళనాడు యూత్ కి ఐకాన్ లాగా మారిపోయాడు. అయితే ఈ మూవీ ఒక్క పార్ట్ తో ఆగిపోకుండా ఫ్రాంచైజ్ లాగా రావాలని కోరుకునే వారు ఉన్నారట. దాంతో ఈ చిత్ర డైరెక్టర్ అస్వత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చాడు.. ఈ సినిమాకు సీక్వెల్ ని తీసే ఆలోచన ఉందని చెప్పాడు. మరి ఆ మూవీ గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. స్క్రిప్ట్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక హీరో కి వినిపించడమే బ్యాలన్స్ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్.. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

దర్శకుడు అస్వత్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు

ప్రదీప్ రంగనాథన్ సినీ ప్రస్థానం

హీరో ప్రదీప్ రంగనాథన్ ‘కోమలి’ అనే చిత్రంతో డైరెక్టర్గా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.. మొదటి సినిమాతోనే భారీ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ లవ్ టుడే.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఆ తర్వాత డ్రాగన్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్లు రాబట్టింది. రీసెంట్ గా డ్యూడ్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు డ్రాగన్ సీక్వెల్ మూవీలో నటించబోతున్నాడు. ఈసారి పవర్ ఫుల్ స్టోరీ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ 150 కోట్లు వసూలు చేస్తే.. ప్రస్తుతం సీక్వెల్ గా రాబోతున్న సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటుంది అని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.. ఈ చిత్రం తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సీక్వెల్ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రదీప్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.