
📌 Key Points
- క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మహావది 50 ఏళ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్ లో రాణిస్తోంది.
- 2025 ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున పాల్గొంది.
- 84 కేజీల పవర్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్, ఇతర విభాగాల్లో గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించింది.
- నటిగా గుర్తింపుతో పాటు దేశానికి పతకాలు తీసుకురావడం ఆమెను సోషల్ మీడియాలో వైరల్ చేసింది.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మహావది 50 ఏళ్ల వయసులో ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున పాల్గొని సిల్వర్ మెడల్‌తో పాటు పలు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఆమె ఈ అసాధారణ విజయంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ జర్నీ
Pragathi Mahavadi : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్ళ నుంచి మెప్పిస్తుంది ప్రగతి. కానీ గత కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెయిట్ లిఫ్టింగ్ లో అనేక కాంపిటీషన్స్ లో పతకాలు సాధిస్తుంది. తన వెయిట్ లిఫ్టింగ్ జర్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది ప్రగతి. ఇప్పటికే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవల్లో ఎన్నో పతకాలు సాధించిన ప్రగతి ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ లెవల్ లో భారతదేశానికి పతకం తెచ్చింది.(Pragathi Mahavadi)
2025 ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో మన ఇండియా తరపున ప్రగతి కూడా పాల్గొంది. ఈ పోటీల్లో ప్రగతి వివిధ విభాగాలలో వెయిట్ లిఫ్టింగ్ చేసింది. మెయిన్ 84 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో ప్రగతి ఏకంగా సిల్వర్ మెడల్ సాధించింది. అంతే కాకుండా డెడ్ లిఫ్ట్, బెంచ్, స్క్వాడ్ విభాగాల్లో ఒక గోల్డ్, రెండు సిల్వర్ పతకాలు సాధించింది ప్రగతి.
అంతర్జాతీయ స్థాయిలో ప్రగతి పతకాలు
దీంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు, సినిమా సెలబ్రిటీలు ప్రగతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెని చూసి గర్విస్తున్నారు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు వెయిట్ లిఫ్టింగ్ లో తన కెరీర్ ఏర్పరుచుకొని ఇలా ఇంటర్నేషనల్ లెవల్లో దేశానికి పతకాలు తీసుకురావడం నిజంగా అభినందనీయం. దీంతో ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రగతి కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో తెలుపుతూ తనకు ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ ఉదయ్ కి కృతజ్ఞతలు తెలిపింది.
దేశానికి గర్వకారణంగా నటి ప్రగతి
నటిగా, వెయిట్ లిఫ్టర్‌గా ప్రగతి మహావది సాధించిన ఈ విజయం ఎంతో మందికి ఆదర్శప్రాయం. 50 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తీసుకురావడం నిజంగా అభినందనీయం. ఆమె అంకితభావం, పట్టుదల ప్రశంసనీయం.


