
📌 Key Points
- బాలీవుడ్ ఆత్మను కోల్పోయి ప్లాస్టిక్ విగ్రహాల మ్యూజియంలా మారిందని ప్రకాష్ రాజ్ విమర్శించారు.
- దక్షిణాది సినిమాలు సహజత్వం, మట్టి వాసనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ఆయన అన్నారు.
- సృజనాత్మకత ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, భారీ సెట్లు, మేకప్‌లు పనికిరావని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.
- బాలీవుడ్ వాస్తవానికి దూరంగా ఉంటే, దక్షిణాది సినిమాలు సామాన్యుడి కష్టాలను చూపిస్తున్నాయని ఆయన తెలిపారు.
నటుడు ప్రకాష్ రాజ్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తన ఆత్మను కోల్పోయిందని, కేవలం ప్లాస్టిక్ విగ్రహాలున్న మ్యూజియంలా మారిందని ఆయన విమర్శించారు. ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్‌పై ప్రకాష్ రాజ్ విమర్శలు
Prakash Raj:నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతారని మనందరికీ తెలుసు. ఎన్నో సందర్బాలలో ఆయన విమర్శలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హిందీ సినిమా తన ఆత్మను కోల్పోయిందని, కేవలం ప్లాస్టిక్ విగ్రహాలున్న మ్యూజియం లా మారిందని ఆయన విమర్శించడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేవలం గ్లామర్ మీద ఆధారపడటం వల్లనే ప్రేక్షకులు బాలీవుడ్‌కు దూరమవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
అసలు ఏమి జరిగిందంటే.. ప్రకాష్ రాజ్ కేవలం విమర్శించడమే కాకుండా, దక్షిణాది సినిమాల విజయ రహస్యాన్ని కూడా విశ్లేషించారు. మలయాళ, తమిళ చిత్రాలు కథలో సహజత్వాన్ని, మట్టి వాసనను,అక్కడి ప్రజల సమస్యలను చూపిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. అందుకే ఆ సినిమాలు భాషా పరిధులను దాటి అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. సృజనాత్మకత ఉన్నప్పుడే ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారని, కేవలం భారీ బడ్జెట్ సెట్లు, మేకప్‌లతో ప్రేక్షకులను మాయ చేయలేమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
దక్షిణాది సినిమాల విజయ రహస్యం
ఆయన చేసిన కామెంట్స్ నేటి డిజిటల్ యుగంలో ప్రేక్షకుల మారుతున్న అభిరుచులకు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు స్టార్ పవర్ ఉంటే చాలు సినిమాలు ఆడేవి, కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని సామాన్య ప్రేక్షకుడు కూడా ప్రపంచ స్థాయి సినిమాలను చూస్తున్నాడు. అందుకే కృత్రిమంగా ఉండే కథలను వారు తిరస్కరిస్తున్నారు. బాలీవుడ్ కేవలం విలాసవంతమైన జీవితాలను, వాస్తవానికి దూరంగా ఉండే పాత్రలను చూపిస్తుంటే, దక్షిణాది చిత్రాలు సామాన్యుడి కష్టాలను, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నాయి. ఈ ‘కనెక్టివిటీ’ లోపించడం వల్లే హిందీ సినిమా సంక్షోభంలో పడిందని, కథలో దమ్ముంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ చర్చ స్పష్టం చేస్తోంది.
చివరగా.. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలను కేవలం విమర్శగా కాకుండా ఒక హెచ్చరికగా చూడాలి అని సగటు ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు. సినీ ప్రేమికులు ఇప్పుడు గ్లోబల్ కంటెంట్‌ను చూస్తున్నారు, కాబట్టి పాతకాలపు ఫార్ములా సినిమాలు ఇక వర్కౌట్ కావు. కథలో బలం, పాత్రల్లో నిజాయితీ ఉన్నప్పుడే ఏ పరిశ్రమ అయినా మనుగడ సాగించగలదు.
ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు
బాలీవుడ్ తన తప్పులను సరిదిద్దుకుని మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలంటే, ప్లాస్టిక్ మెరుగుల కంటే మట్టి మూలాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు మునుపు కూడా ప్రకాష్ రాజ్ బాలీవుడ్ గురించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే ..అప్పట్లో ఆయనకు బాలీవుడ్ అవకాశాలు రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ కొందరు అమ్ముడు పోయారంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. ఇది ఎలాంటి చర్చకు దారి తీస్తుందో చూడాలి.
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు బాలీవుడ్‌కు హెచ్చరికగా భావించాలని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కథలో బలం, నిజాయితీ ఉంటేనే పరిశ్రమ మనుగడ సాగిస్తుందని ఆయన అన్నారు.


