|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా టికెట్ ధరలపై ప్రకాష్ రాజ్ షాకింగ్ వ్యాఖ్యలు: ‘చూడలేకపోతే మానేయండి!’

Published: 27-12-2025, 11:21 AM
సినిమా టికెట్ ధరలపై ప్రకాష్ రాజ్ షాకింగ్ వ్యాఖ్యలు: 'చూడలేకపోతే మానేయండి!'
  • ఇటీవల సినిమా టికెట్ల ధరల పెంపుపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
  • టికెట్లు భారం అనిపిస్తే సినిమాలు చూడకండని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • సినిమా అంటే వ్యాపారమేనని, నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
  • థియేటర్లకు ప్రేక్షకులను తిరిగి తీసుకురావడానికి పాప్ కార్న్ ధరలు తగ్గించాలని డిమాండ్.

సినిమా టికెట్ల ధరల వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. టికెట్ ధరలు భారం అనిపిస్తే సినిమాలు చూడవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశ్యం

Prakash Raj: ఇటీవల కాలంలో సినిమా టికెట్ల ధరల (Ticket Price)గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమాని నిర్మించడం కోసం ఇటీవల కాలంలో వేల కోట్ల రూపాయలు నిర్మాతలు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలు విడుదల సమయంలో కచ్చితంగా టికెట్ల రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక్కో టికెట్ పై భారీగా ధరలు పెంచడంతో సామాన్యులు సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సినిమాలు థియేటర్ కి వచ్చి చూస్తారనే వాదన కూడా వినపడుతుంది.

ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ ధరల గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రకాష్ రాజ్సై తం సినిమా టికెట్ ధరల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న ఈయనకు సినిమా టికెట్ ధరల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ప్రకాష్ రాజ్(Prakash Raj) సమాధానం చెబుతూ సినిమా టికెట్ ధరలు పెరిగితే సినిమా చూడటం మానేయండి అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చారు. సినిమా అంటేనే వ్యాపారం. ఎవరి వ్యాపారం వాడిదే. దొంగ పనులు చేస్తున్న వాడు హీరో ఎలా అవుతాడు ఈ దేశానికి ఒక దొంగే మహాప్రభువు అయ్యారంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

సినిమా టికెట్ ధరల వివాదం: వ్యాపారమా లేక భారమా?

ఇలా సినిమాని నిర్మాతలు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసే నిర్మిస్తూ తిరిగి ఆ డబ్బును రాబట్టడం కోసమే టికెట్ ధరలను పెంచుతూ ఆ భారం మొత్తం ప్రేక్షకులపై వేస్తున్నారు అందుకే నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలి అంటూ ఎంతోమంది ఈ విషయంపై స్పందించారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇది వ్యాపారం అంటూ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా టికెట్ ధరలు పెంచడం, సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.

టికెట్ ధరలు అందుబాటులో ఉండాలి..

థియేటర్లలో తగ్గుతున్న ప్రేక్షకులు: పరిష్కారం ఏంటి?

ప్రేక్షకులు తిరిగి థియేటర్ కు రావాలి అంటే కచ్చితంగా సినిమా టికెట్ ధరలతో పాటు థియేటర్లలో లభించే పాప్ కార్న్ ధరలు కూడా అందుబాటులో ఉండాలని పలువురు సినీ ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇదే విషయం గురించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇక నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో సినిమాలకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న టికెట్ ధరల వివాదాన్ని మరింత పెంచాయి. ఈ వ్యాపార కోణం, ప్రేక్షకుల భారం మధ్య సమతుల్యం ఎలా సాధించాలనేది ప్రభుత్వాలు, సినీ పెద్దలకు పెద్ద సవాలుగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.