
📌 Key Points
- ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు సందీప్ రెడ్డి వంగా ధృవీకరించారు.
- షూటింగ్ లొకేషన్లో రాజకీయ చర్చల వల్ల ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి.
- ప్రకాష్ రాజ్ ఈ వార్తలను ఖండిస్తూ ఇంకా తన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కాలేదని తెలిపారు.
- స్పిరిట్ సినిమా గురించి వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారా లేదా అనే దానిపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
స్పిరిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన?
Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్పిరిట్ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని సందీప్ రెడ్డి అధికారికంగా ఒక ఆడియో టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో ప్రకాష్ రాజ్ పాల్గొనబోతున్నారు. ఈ సినిమా గురించి నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ తప్పుకోవడం గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి సందీప్ రెడ్డి ప్రకాష్ రాజ్ మధ్య షూటింగ్ లొకేషన్లో రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిగాయని ఈ చర్చలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం కావడంతో ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తెలియజేశారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అనే విషయం తెలియడంతో నేటిజన్ లు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ తప్పుకోవడం గురించి వార్తలు వైరల్ అవ్వడంతో స్వయంగా ప్రకాష్ రాజ్ ఈ వార్తలపై స్పందించారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్.. ఈ విషయం గురించి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. తాను స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్నానంటూ ఈ విషపూరితమైనటువంటి వార్తలను ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను.. స్పిరిట్ సినిమాలో ఇంకా నా పాత్రకు సంబంధించిన షూటింగ్ జరగలేదని , అప్పుడే మీరు కథలను అల్లి ప్రచారం చేస్తున్నారు. కాస్త పెద్దవారి లాగా ప్రవర్తించండి, వెళ్లి మీ పనులు చూసుకోండి.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఈ తప్పుడు వార్తలను ప్రకాష్ రాజ్ ఖండించారు.
ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే వార్తల్లో నిజమెంత?
To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life 😂😂😂😂. #justasking
— Prakash Raj (@prakashraaj) February 9, 2026
ఫేక్ న్యూస్ పై ప్రకాష్ రాజ్ రియాక్షన్
ఇలా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టడంతో స్పిరిట్ సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని క్లారిటీ వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లేకుండా ఇతర నటీనటుల పై స్పిరిట్ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఫాజీ పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే స్పిరిట్ సినిమాలో భాగమవుతారు అలాగే ప్రకాష్ రాజ్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా త్వరలోనే చిత్రీకరణ జరుపుకోబోతున్నాయి. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ నటించబోతున్న సంగతి తెలిసిందే అలాగే విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ క్లారిటీ లేదు. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా త్రిప్తి దిమ్రి నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రకాష్ రాజ్ తన ప్రకటనతో స్పిరిట్ సినిమా గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.

