|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామలక్ష్మణులపై ప్రకాష్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు! పరువు నష్టం దావా!

Published: 18-04-2026, 2:35 AM
  • రామలక్ష్మణులపై ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం, పరువు నష్టం దావా.
  • కేరళ సాహిత్య ఉత్సవంలో రామాయణంపై ప్రకాష్‌రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.
  • శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కార్మికులుగా అభివర్ణించిన ప్రకాష్‌రాజ్.
  • రాముడిపై ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం.

నటుడు ప్రకాష్‌రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రామలక్ష్మణులపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయనపై పరువు నష్టం దావా కూడా దాఖలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

రామలక్ష్మణులపై ప్రకాష్‌రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

నటుడు ప్రకాశ్‌రాజ్ తాను చేసే కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా రామలక్ష్మణుల మీద మాట్లాడారు. దీంతో చాలా హిందూ సంఘాలు ప్రకాశ్‌రాజ్‌ను విమర్శిస్తున్నాయి.

అంతేకాదు ప్రకాశ్‌రాజ్ మీద పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఈ పరువు నష్టం దావా దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాశ్‌రాజ్ మాట్లాడారని విమర్శించారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కావాలనే రామలక్ష్మణులపై వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.

కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో ప్రకాశ్‌రాజ్ పాల్గొన్నాడు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ.. రామాయణాన్ని గురించి కామెంట్స్ చేశాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కార్మికులుగా అభివర్ణించాడు. రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా వ్యాఖ్యానించాడు.

ప్రకాష్‌రాజ్‌పై హిందూ సంఘాల ఆగ్రహం, పరువు నష్టం దావా

‘ రాముడు , లక్ష్మణుడు దక్షిణాదిలోని ఒక తోటలోకి ప్రవేశించి అక్కడ పండ్లను దొంగతనంగా తిన్నారు. ఆ సమయంలో ఆ తోట యజమానికి అయిన రావణుడితో వారికి గొడవ జరిగింది. అదే రామాయణ యుద్ధానికి కారణం.’ అని కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాడు ప్రకాశ్‌రాజ్.

కోట్లాది మందికి ఆరాధ్యుడైన రాముడిపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు ప్రకాశ్‌రాజ్‌ను విమర్శిస్తున్నాయి. పవిత్రంగా భావించేవారిని ఇలా అపహాస్యం చేయడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. హిందూ ధర్మంపై ప్రకాశ్‌రాజ్‌కు ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

ఇక సోషల్ మీడియా లో ప్రకాశ్‌రాజ్ మీద కామెంట్ల వర్షం కురుస్తోంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రామాయణాన్ని వక్రీకరిస్తున్నట్టుగా మండిపడుతున్నారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. వలస కూలీలు అనడంపై దురుద్దేశం ఉందన్నారు.

రామాయణంపై ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలపై నెటిజన్ల విమర్శలు

ప్రకాశ్ రాజ్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు అంటున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మత విశ్వాసాలను దెబ్బతీయడం సరైనది కాదని పలువురు చెబుతున్నారు. ప్రకాశ్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టేలా, సంప్రదాయాలను వక్రీకరిస్తూ.. మాట్లాడుతున్నారన్నారు. ఈ మేరకు కొన్ని చోట్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.

ప్రకాశ్‌రాజ్‌కు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని, సినిమా ఇండస్ట్రీ నుంచి అతడిని బరిష్కరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో #BanPrakashRaj వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.