
📌 Key Points
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల, నెట్టింట భారీ రెస్పాన్స్. ప్రశాంత్ నీల్ కొత్త జానర్ పై కీలక ప్రకటన.
- కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ కు గుడ్ బై. ఫ్యాన్స్ లో చర్చ.
- ‘డ్రాగన్’, ప్రభాస్ ‘సలార్ 2’ తర్వాత కొత్త కథలు. డైరెక్టర్ ఆలోచనతో ఉత్కంఠ.
- ప్రశాంత్ నీల్ నిర్ణయంతో కొందరు ఫ్యాన్స్ షాక్, మరికొందరు కొత్తదనం కోసం ఆశగా ఎదురుచూపు.
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ! మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసుకున్న సంచలన నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ తర్వాత ఆయన కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ వైరల్ న్యూస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం!
సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘డ్రాగన్’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. నెట్టింట సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భారీ యాక్షన్ జానర్‌కు గుబ్ బై చెప్పనున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ వంటి చిత్రాలు బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని కాసుల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు అదే జానర్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే.. ఒకపక్కా ప్రశాంత్ నీల్ వరుస హిట్స్ అందుకుంటున్నాడు అనే టాక్ ఉన్నా.. మరో పక్కా మాత్రం ఒకటే జానర్‌తో విసుగుచెందుతున్నారు కొందరు నెటిజన్లు. కేజీఎఫ్ మొదలు ఇప్పుడు రాబోయే డ్రాగన్ వరకు కూడా అదే డార్క్ భారీ యాక్షన్ జానర్‌తో విసుగుచెందిన నెటిజన్లు కొత్త కథ కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. ఇకపై భారీ యాక్షన్ జానర్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు అన్నట్టు ప్రకటించడం విశేషంగా మారింది. అయితే.. ప్రభాస్ సలార్ 2 కూడా లైన్‌లో ఉండగా.. డ్రాగన్, సలార్ 2 అనంతరం కొత్త కథను తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుండగా.. నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాన్స్ షాక్, నెటిజన్ల ఆనందం!
డ్రాగన్, సలార్ 2 తర్వాత కొత్త జానర్?
ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. ‘డ్రాగన్’, ‘సలార్ 2’ తర్వాత ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


