
బాలీవుడ్ నటి ప్రీతి జింటా తాజాగా ట్విట్టర్‌లో ఫొటోగ్రాఫర్లకు కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. తన పిల్లల ఫొటోలు, వ్యక్తిగత ప్రాంతాల్లో ఫొటోలు తీయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Key Points
ప్రీతి జింటా ఫొటోల గురించి తన అభిప్రాయాలను పంచుకుంది.
ఆలయాలు, బాత్రూమ్‌లు, భద్రతా తనిఖీల సమయంలో ఫొటోలు తీయడం ఆమెకు ఇష్టం లేదు.
అనుమతి లేకుండా వీడియోలు తీయడం ఇబ్బందికరం అని ఆమె తెలిపింది.
ప్రీతి జింటా యొక్క ట్విట్టర్ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta) ‘దిల్ సే’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగులో ఈ అమ్మడు ‘రాజకుమారుడు’(Raja Kumarudu) చిత్రంలో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్‌తో పాటు బాలీవుడ్ బడా హీరోలతోనూ నటించి మెప్పించింది. తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా పంజాబీ, ఇంగ్లీష్ వంటి చిత్రాల్లోనూ నటించింది. ఇక ఇటీవల ప్రీతి జింటా ‘లాహోర్’ (Lahore)మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే టైమ్ ఉన్నప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ చేస్తోంది. తాజాగా, ప్రీతి జింటా ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించింది.
ఇందులో భాగంగా ఫొటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఓ నెటిజన్ ‘మీ గురించి తెలియని విషయం ఒకటి చెప్పండి’ అని అడగ్గా.. దానికి ప్రీతి స్పందిస్తూ.. ‘‘ఆలయాలలో, బాత్రూంలో, భద్రతా తనిఖీల సమయంలో ఫొటోలు తీస్తే నాకు కోపం వస్తుంది. ఈ సమయాలలో తప్ప మిగతా సమయంలో ఫొటో అడిగిన, నాతో దిగిన కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ముఖ్యంగా నా పిల్లల ఫొటోలు తీస్తే నాలోని కాళి బయటకు వస్తుంది. నేను ఎంతో సరదా మనిషిని. కానీ నా అనుమతి లేకుండా వీడియోలు తీయొద్దు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా నేరుగా నన్ను అడగండి. దయచేసి నా పిల్లలను వదిలేయండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఫొటోలపై ఆమె అభిప్రాయాలు
నెటిజన్ల స్పందన
ప్రీతి జింటా అభిమానులతో సన్నిహితంగా ఉంటూనే, వారి ప్రైవసీ గౌరవించాలని కోరుకుంటోంది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయకూడదని ఆమె మనవి చేసింది.


