
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘సర్‌జమీన్’ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ సైనిక అధికారిగా కనిపిస్తున్నారు.
Key Points
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సర్‌జమీన్’లో సైనిక అధికారిగా కనిపిస్తున్నారు.
కాజోల్ మరియు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నక్సలైట్లచే కిడ్నాప్ చేయబడిన కొడుకును కాపాడటానికి పృథ్వీరాజ్ చేసే ప్రయత్నాల చుట్టూ కథ తిరుగుతుంది.
ఎమోషనల్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి.
సర్‌జమీన్ ట్రైలర్ విడుదల
డైరెక్టర్‌గా, హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సర్‌జమీన్’ (Sar Zameen). కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఈనెల 25నుంచి జియో హార్ట్ స్టార్‌లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా సర్‌జమీన్ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మీకు తెలుసా.. అక్కడ చాలా గాయాలు ఉన్నాయి.. నువ్వు వాళ్ళని మర్చిపోయే వరకు అది బాధిస్తూనే ఉంటుంది’ అంటూ మంచు కొండల్లో అలీ ఖాన్ ఎంట్రీ ఉంటుంది.. ఇక ‘నాకు నా మాతృభూమి కంటే ఏది ఎక్కువ కాదు.. నా కొడుకు లైఫ్ బలైనా కూడా’ అంటూ ఓ సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తాడు. నక్సలైట్లు సుకుమారన్ కొడుకును కిడ్నాప్ చేయగా.. వారి నుంచి తన దేశంతో పాటు కొడుకును ఎలా కాపాడుకుంటాడు అనేది స్టోరీ అని తెలుస్తుండగా.. తల్లిగా కాజోల్ ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. లింక్
పృథ్వీరాజ్ సుకుమారన్ సైనిక పాత్ర
ఎమోషనల్ సన్నివేశాలు
‘సర్‌జమీన్’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ల నటన, ఎమోషనల్ సన్నివేశాలు చూడాలనిపిస్తున్నాయి.


