|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అడివి శేష్ ‘డెకాయిట్’: ట్రైలర్ విధ్వంసం! ఏప్రిల్ 10న థియేటర్లలో అడుగుపెట్టనున్న చిత్రం!

Published: 04-04-2026, 7:05 AM
అడివి శేష్ 'డెకాయిట్': ట్రైలర్ విధ్వంసం! ఏప్రిల్ 10న థియేటర్లలో అడుగుపెట్టనున్న చిత్రం!
  • అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జంటగా ‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
  • షనీల్ డియో దర్శకత్వంలో రివెంజ్ డ్రామా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది.
  • ట్రైలర్‌లో హరి, జూలియట్ పాత్రల మధ్య కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి.
  • అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందించారు.

అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం రివెంజ్ డ్రామాగా రూపొందింది.

ఏప్రిల్ 10న విడుదల కానున్న ‘డెకాయిట్’

Dacoit Trailer: అడివి శేష్ మృణాళ్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం డెకాయిట్ (Dacoit).షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రివెంజ్ డ్రామా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా శేష్ హిట్ కొట్టబోతున్నారని స్పష్టం అవుతుంది. ఇందులో వీరు హరి, జూలియట్ అనే పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రేమికులుగా ఉన్న వీరిద్దరూ పెళ్లి అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆ సమయంలోనే హరి జైలుకు వెళ్లడం, జూలియట్ డబ్బు పరంగా సమస్యలను ఎదుర్కోవటం? జైలులో ఉన్న హరిని తప్పించడం కోసం జూలియట్ ఏం చేస్తుంది? హరి జైలు నుంచి ఎలా బయటపడ్డారు అని విషయాల గురించి ఈ ట్రైలర్ లో చూపించారు.

ఆకట్టుకుంటున్న ట్రైలర్..హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్

అదిరిపోయిన హరి జూలియట్ కెమిస్ట్రీ..

ఈ ట్రైలర్ వీడియో మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో హరి జూలియట్ మధ్య రొమాంటిక్ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, బిజిఎం, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. మొత్తానికి ఈ ట్రైలర్ వీడియో సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేస్తుంది ట్రైలర్ చూస్తుంటేనే బ్లాక్ బస్టర్ కు శేష్ రెడీ అవుతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో అనురాగ కస్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

హరి, జూలియట్ పాత్రలలో అడివి శేష్, మృణాళ్ ఠాకూర్

షనీల్ డియోల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు బీమ్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఏప్రిల్ నెలలో పెద్దగా సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఈ చిత్రం సోలోగానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి సోలోగా విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక హీరో అడివి శేష్ విషయానికి వస్తే ఈయన చేసేది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో విభిన్నమైన మంచి కంటెంట్ ఉన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ఏప్రిల్ నెలలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ‘డెకాయిట్’ సోలోగా విడుదల కానుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అడివి శేష్ మరో హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.