|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prithviraj Sukumaran: ఆర్మీ ఆఫీసర్‌గా సలార్ హీరో.. అఫీషియల్ ట్రైలర్ చూశారా?

Published: 04-07-2025, 6:46 AM
Prithviraj Sukumaran: ఆర్మీ ఆఫీసర్‌గా సలార్ హీరో.. అఫీషియల్ ట్రైలర్ చూశారా?

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘సర్‌జమీన్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కాజోల్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ చిత్రం జియో హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

Key Points

1

పృథ్వీరాజ్ సుకుమారన్ 'సర్‌జమీన్' లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

2

కాజోల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.

4

కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కింది.

సర్‌జమీన్ చిత్రం ట్రైలర్ విడుదల

సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఏడాది ఎంపురాన్‌-2 మూవీతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో యాక్షన్‌ సినిమాతో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న యాక్షన్‌ చిత్రం సర్‌జమీన్. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్‌గా నటించింది.

తాజాగా సర్‌జమీన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ‍అలీ ఖాన్‌ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు. ఈ నెల 25 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర

జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్

చివరగా, ‘సర్‌జమీన్’ చిత్రం ఓటీటీ విడుదలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానులకు ఇది మంచి విందు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.