|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్ లో కుట్రలు! నన్ను తొక్కేయాలని చూశారు: ప్రియాంక సంచలన ఆరోపణలు!

Published: 23-02-2026, 8:35 AM
బాలీవుడ్ లో కుట్రలు! నన్ను తొక్కేయాలని చూశారు: ప్రియాంక సంచలన ఆరోపణలు!
  • ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లడానికి గల కారణాలను వెల్లడించారు.
  • బాలీవుడ్ లో తనను తొక్కేయడానికి ప్రయత్నించారని ప్రియాంక ఆరోపించారు.
  • హాలీవుడ్ లో ప్రియాంక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
  • భారతీయ సినిమాలలో నటించడం తనకు ఎంతో ఇష్టమని ప్రియాంక తెలిపారు.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ గురించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తనను తొక్కేసే ప్రయత్నాలు జరిగాయని, అందుకే హాలీవుడ్ కి వెళ్లాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ పై ప్రియాంక సంచలన ఆరోపణలు

Priyanka Chopra: ప్రియాంక చోప్రా పరిచయం అవసరం లేని పేరు. గ్లోబల్ బ్యూటీగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS.Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణసి(Varanasi) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ఉన్న ఫలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అవుతూ హాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.. ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. వారణాసి సినిమా పనులలో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా తిరిగి బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈమె గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలలో కనిపించకపోవడంతో అందుకు గల కారణాలు ఏంటనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ప్రియాంక చోప్రా సమాధానం చెబుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనపై కుట్రలు జరిగాయి అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా సక్సెస్

తాను బాలీవుడ్ ఇండస్ట్రీని కావాలనే వదిలేయలేదు అక్కడ వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే కెరియర్ పరంగా నా మార్కెట్ ను విస్తరించుకోవాలని ఆ దిశగా ప్రయత్నాలు చేశాను కానీ ఒకానొక సమయంలో నా కెరియర్ ముందుకు వెళ్లకుండా ఒకే చోటే ఆగిపోయిందనే భావన కలిగింది. ఉన్నఫలంగా నాకు అవకాశాలు తగ్గిపోవడం కావాలనే నన్ను పక్కన పెట్టేయడం, అవకాశాలు లేకుండా తొక్కేయాలని ప్రయత్నాలు జరిగాయని ఈ కారణాల వల్ల తాను ఎంతో ఒత్తిడికి గురయ్యానని ప్రియాంక చోప్రా తెలిపారు. ఇలా ఒత్తిడి కారణంగానే తాను బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు.

ఇలాంటి సమయంలోనే తనని తాను నిరూపించుకోవడం కోసమే హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నానని తెలియజేశారు. అయితే ఇప్పటికి కూడా నాకు ఇండియన్ సినిమాలలో నటించడం చాలా ఇష్టం అంటూ ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం కావడానికి అసలు కారణం ఇదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలా మంచి సక్సెస్ అందుకున్న వారిని తొక్కేసే ప్రయత్నాలు జరగటం సర్వసాధారణం ఇలా ఎంతోమంది ఇలాంటి వాటికి బలి అయ్యి ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే.

భారతీయ సినిమాలపై ప్రియాంక ఆసక్తి

ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె కెరీర్ పై జరిగిన కుట్రల గురించి మరింత సమాచారం రానున్న రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.