|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి.. ఆ పాట కష్టంగా చేశానంటూ ప్రియాంక చోప్రా షాకింగ్ పోస్ట్

Published: 01-08-2025, 4:55 AM
జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి.. ఆ పాట కష్టంగా చేశానంటూ ప్రియాంక చోప్రా షాకింగ్ పోస్ట్

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా ‘రామ్ లీలా’ పాటకు సంబంధించి తన అనుభవాన్ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె కష్టపడి పాటను చేసిందని తెలిపింది.

Key Points

1

ప్రియాంక చోప్రా 'రామ్ లీలా' పాట గురించి తన అనుభవాన్ని పంచుకుంది.

2

ఆ పాటను ఎంత కష్టపడి చేసిందో వివరించింది.

4

ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమా 'SSMB-29' లో నటిస్తోంది.

‘రామ్ లీలా’ పాట గురించి ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఓ పాటకు తాను కష్టంగానే ఒకే చేసినట్లు తెలుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఒకప్పుడు ట్రెండ్ సృష్టించిన ‘రామ్ చాహే లీలా’ (Ram Chahe Leela)సాంగ్ వీడియోను షేర్ చేస్తూ ‘‘సంజయ్ ఈ పాట కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను చేయగలనా అని అనుకున్నాను. నేను తీసుకున్న కఠినమైన నిర్ణయం ఇదే. కష్టంగానే చేస్తానని చెప్పాను. కానీ దర్శకుడు నాకు ధైర్యానిచ్చాడు.

హావభావాల దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకూ ఆయన సలహాలిచ్చారు. పాటలోని ప్రతి పదం అర్థాన్ని నాకు అర్థం అయ్యేలా వివరించారు. ఈ పాటను కొరియోగ్రాఫర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. భోజన విరామ సమయంలోనూ నాకు డ్యాన్స్ మూమెంట్స్ గురించే వివరించేవారు. ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. కాగా, సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామ్- లీలా’. ఇందులోదీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించారు. ఇక ఇందులో ప్రియాంక చోప్రా స్పెషల్ సాంగ్ చేసింది.

కష్టపడి చేసిన పాట అనుభవం

అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య 2013లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘SSMB-29’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన బగ్ ఏర్పడింది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు, సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు.

ప్రియాంక చోప్రా తాజా సినిమా

A post shared by Priyanka (@priyankachopra)

ప్రియాంక చోప్రా ‘రామ్ లీలా’ పాట అనుభవం గురించి పంచుకున్న విషయం నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ బాబు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.