|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Priyanka Chopra: మహిళల వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది.. బిగ్ షాక్ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. పోస్ట్ వైరల్

Published: 26-06-2025, 10:15 AM
Priyanka Chopra: మహిళల వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది.. బిగ్ షాక్ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. పోస్ట్ వైరల్

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై వర్జినిటీపై బోల్డ్ కామెంట్స్ చేసిందని పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తలను ఖండించిన ప్రియాంక, సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చే పోస్ట్ పెట్టింది. SSMB-29 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక ఈ విషయంపై స్పందించింది.

Key Points

1

ప్రియాంక చోప్రా త్వరలోనే టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.

2

ఆమెపై వర్జినిటీపై బోల్డ్ కామెంట్స్ చేసిందని పుకార్లు.

4

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చే పోస్ట్ పెట్టింది.

ప్రియాంక చోప్రా వైరల్ పోస్ట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరసన ‘SSMB-29’ చిత్రంలో కనిపించనుంది. రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. ప్రియాంక చోప్రా చిక్కుల్లో పడింది. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ చర్చకు దారితీశాయి. వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు గుణాలు ఉన్న మహిళను వివాహం చేసుకోండి. ఎందుకంటే వర్జినిటీ అనేది ఒక్క రాత్రితో పోతుంది.. సంస్కారం జీవితాంతం ఉంటుందని’’ యువతకు సలహా ఇచ్చినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

తాజాగా, ఈ విషయంపై ప్రియాంక క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఇలాంటి కామెంట్స్ నేను ఎక్కడా చేయలేదు. ఈ విధంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది సోషల్ మీడియాలో సృష్టించిన వార్త మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు. ఇతరుల దృష్టిని ఆకర్షించి వైరల్ కావడం కోసం ఇలాంటి అసత్య వార్తలను సృష్టించడం ఇప్పుడు సులభమైపోయింది. ప్రజలు ఇలాంటి వార్తలు నమ్మే ముందు దయచేసి ఒకసారి నిజానిజాలు తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో వచ్చే ప్రతి వార్త నమ్మొద్దు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆమె గురించి రాసిన ఓ న్యూస్ చానల్ క్లిప్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసత్య వార్తలపై ప్రియాంక స్పందన

SSMB-29 చిత్రం

ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య వార్తలను ఖండించింది. తనపై వచ్చిన పుకార్లను ప్రజలు నమ్మవద్దని కోరింది. ఆమె త్వరలోనే SSMB-29 లో కనిపించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.