
📌 Key Points
- మహేష్ బాబు-రాజమౌళి ‘వారణాసి’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
- రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ బడ్జెట్ రూ. 600 కోట్లు కాగా, ‘వారణాసి’ రూ. 1000 కోట్లు దాటవచ్చని ప్రచారం.
- ప్రముఖ కామెడీ షోలో పాల్గొన్న ప్రియాంక చోప్రా, ‘వారణాసి’ బడ్జెట్‌పై కీలక హింట్ ఇచ్చింది.
- కపిల్ శర్మ ‘వారణాసి’ బడ్జెట్ రూ. 1300 కోట్లు అని ప్రస్తావించడం గమనార్హం.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై భారీ బజ్ నెలకొంది. ఈ చిత్రం బడ్జెట్ వెయ్యి కోట్లు దాటుతుందనే ఊహాగానాలున్నాయి. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ బడ్జెట్‌పై కీలక హింట్ ఇచ్చి ఆసక్తి రేపారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
రాజమౌళి-మహేష్ బాబు ‘వారణాసి’ క్రేజ్ మామూలుగా లేదు!
Priyanka About Varanasi Budget : సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’ ( Varanasi Movie). మహేష్ బాబు 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై విపరీతమైన బజ్ నెలకొంది . రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో ఈ సినిమా క్రేజ్ గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది . అనౌన్స్ మెంట్ గ్లింప్స్ నే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మించేలా ఏర్పాట్లు చేశాడు జక్కన్న . ఈ కార్యక్రమంలోనే మహేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు మూవీ టైటిల్ ని ప్రకటించారు .
ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కి అంతర్జాతీయ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది . పాన్ వరల్డ్ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని చూసేందుకు హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . అంతగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బడ్జెట్ పై ఆడియన్స్ లో అమితాసక్తిని పెంచింది . ఎందుకంటే ఒక సినిమా పట్ల జక్కన్న విజన్ ని ఎవరూ అంచన వేయలేరు . కనీసం ఆయన సినిమా టైటిల్ , కాస్ట్ డిటైయిల్స్ తప్పిదే అసలు మూవీ జానర్ ఏంటి , అదే నేపథ్యం అనే అంశాన్ని కూడా బయటకు రానివ్వడు రాజమౌళి . ఇక ఆయన సినిమాలో వీఎఫ్ ఎక్స్ విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ లో చూశాం .
వారణాసి బడ్జెట్‌పై ప్రియాంక చోప్రా షాకింగ్ హింట్
ఇక వారణాసిని వీఎఫ్ ఎక్స్ , గ్రాఫిక్స్ తో ఎంత అద్భుతంగా మలచపోతున్నాడో అనౌన్స్ మెంట్ టీజర్ తో శాంపిల్ వదిలాడు జక్కన్న . అందుకే రాజమౌళి అంటేనే బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ . ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీకి రూ . 600 లకు పైగా కోట్ల బడ్జెట్ పెట్టిన జక్కన్న వారణాసి కోసం ఎంత పెట్టిస్తున్నాడానే చర్చ మొదలైంది . ఈ బడ్జెట్ వెయ్యి కోట్లపైనే ఉంటుందని నెటిజన్స్ నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలో వారణాసి బడ్జెట్ పై హీరోయిన్ ప్రియాంక చోప్రా పెదవి విప్పింది . తాజాగా ఆమె ప్రముఖ కామెడీ టాక్ షో కపిల్ శర్మ షోకు హాజరైంది . ఇందులోప్రియాంక వారణాసి బడ్జెట్ పై హింట్ ఇచ్చింది . ఈ షో హోస్ట్ కపిల్ శర్మ ప్రియాంకతో ఇలా అన్నారు . ‘ వారణాసి’ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. ఈ సినిమాలోకి మీరు వచ్చినప్పటి నుంచీ బడ్జెట్ పెరిగిందని విన్నాం .
ఇది నిజమేనా?’ అని అడిగారు . ‘మీరు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? బడ్జెట్‌లో సగం నా బ్యాంక్ ఖాతాలోకే పోయింది’ అంటున్నారా ? అంటూ సరదాగా నవ్వింది . అయితే ఇక్కడ కపిల్ శర్మ వారణాసి బడ్జెట్ రూ . 1300 కోట్లా ? అని అడగ్గానే .. అవును అన్నట్టుగానే చిన్న నవ్వు నవ్వి హింట్ ఇచ్చింది . దీంతో మూవీ బడ్జెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది . ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే ఇదే అత్యధిక బడ్జెట్ మూవీ అవుతుందని అంటున్నారు . హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్‌కు ఆ మాత్రం బడ్జెట్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కెరీర్‌లో కూడా ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘వారణాసి’ భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న రెండో సినిమాగా నిలిచింది. నితీష్ తివారీ ‘రామాయణ్ పార్ట్ 1’ దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసే బడ్జెటా?
Priyanka chopra about #Varanasi on Kapil Sharma show pic.twitter.com/6kgkusKaGf
— Sunaina🦋 (@Sunaina_speaks) December 20, 2025
ప్రియాంక ఇచ్చిన హింట్‌తో ‘వారణాసి’ బడ్జెట్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది. రూ. 1300 కోట్ల బడ్జెట్ నిజమైతే, ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఎదురుచూడాలి.


