
పవన్ కల్యాణ్ ఓజీ సినిమా సంచలనం సృష్టిస్తోంది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా విజయోత్సవంలో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అభిమానులు ’12 ఏళ్ల ఆకలి తీరింది’ అంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఓజీ సక్సెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో.
Key Points
పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా సెప్టెంబర్ 25న విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, '12 ఏళ్ల ఆకలి తీరింది' అని అభిమానులు చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు.
సుజీత్, తమన్, నవీన్‌లకు పవన్ కళ్యాణ్‌పై ఉన్న ప్రేమ స్క్రీన్ మీద కనిపించిందని నాగవంశీ పేర్కొన్నారు.
హీరోయిన్ ప్రియాంక మోహన్ 'ఓజీ' ఆదరిస్తున్న ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత నాగవంశీ సంతోషం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.
తమన్ సంగీతం అందించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. అభిమానుల నుంచి ఓజీ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ సక్సెస్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత నాగవంశీ ఓజీ మూవీ, పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “తమన్, నవీన్‌తో మేము ఎక్కువగా సినిమాలు చేస్తుంటాం. అలాగే నిర్మాతగా కళ్యాణ్ ఇంతటి భారీ సినిమా చేశాడు. అందుకే టీంకి అభినందనలు తెలపడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా పంపిణీలో మేము కూడా భాగమే” అని అన్నారు.
ఓజీ సక్సెస్ వెనుక కథ
“ఓజీ సినిమా చూసి, మా 12 ఏళ్ల ఆకలి తీర్చారు అంటూ అభిమానులు చెబుతుంటే సంతోషంగా ఉంది. సుజీత్‌కి, తమన్‌కి, నవీన్‌కి వీళ్లందరికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ స్క్రీన్ మీద కనిపించింది. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి” అని ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు.
ఇదే ఈవెంట్‌లో ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. “మీ అందరికీ ఓజీ సినిమా నచ్చిందని అనుకుంటున్నాను. ఓజీ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూశారు. ఇప్పుడు థియేటర్‌లో సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు” అని అన్నారు.
ప్రియాంక మోహన్ స్పందన
“తమన్ చెప్పినట్టు అందరూ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. ఓజీకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇంతకు మించి ప్రేక్షకుల నుంచి మేము ఏం కోరుకుంటాం. మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్నందుకు పవన్ కల్యాణ్ గారి అభిమానులకు, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు” అని ప్రియాంక అరుళ్ మోహన్ చెప్పింది.
“ఓజీ సినిమాని అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. నిజంగానే ఈ సినిమాకి ఆ అర్హత ఉంది. డీవీవీ బ్యానర్‌లో నాకిది రెండో సినిమా. వరుసగా రెండో విజయం దక్కడం సంతోషంగా ఉంది. అలాగే, తమన్ గారితో నాకిది మొదటి సినిమా. నా కెరీర్‌లో ఇది బెస్ట్ ఆల్బమ్. కన్మణి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన సుజీత్ గారికి థాంక్స్. పవన్ గారితో కలిసి నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను” అని ప్రియాంక మోహన్ తెలిపింది.
పవన్ కల్యాణ్ ఓజీ సినిమా అద్భుతమైన స్పందనతో దూసుకుపోవడం చిత్ర యూనిట్‌కు ఆనందాన్ని ఇస్తోంది. నిర్మాత నాగవంశీ, హీరోయిన్ ప్రియాంక మోహన్ వ్యాఖ్యలు సినిమాపై ప్రేక్షకులకున్న ప్రేమను స్పష్టం చేస్తున్నాయి. ఓజీ విజయం థియేటర్ల వద్ద సందడిని కొనసాగిస్తోంది.


