|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మా హీరోయిన్లను బాడీ షేమింగ్ చేస్తే ఊరుకునేది లేదు.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ నిర్మాత వార్నింగ్

Published: 12-07-2025, 2:42 PM
మా హీరోయిన్లను బాడీ షేమింగ్ చేస్తే ఊరుకునేది లేదు.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ నిర్మాత వార్నింగ్

‘వర్జిన్ బాయ్స్’ సినిమా రిలీజ్ తర్వాత, కొంతమంది యూట్యూబర్లు, నెటిజన్లు హీరోయిన్లను బాడీ షేమింగ్ చేశారు. దీనిపై నిర్మాత రాజా దరపునేని తీవ్రంగా స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Key Points

1

నిర్మాత రాజా దరపునేని 'వర్జిన్ బాయ్స్' సినిమా హీరోయిన్లను బాడీ షేమింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

2

యూట్యూబర్లు, నెటిజన్ల నెగెటివ్ కామెంట్లు, బాడీ షేమింగ్‌పై నిర్మాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

4

కొంతమంది జర్నలిస్టులను 'తులసి తోటలో గంజాయి మొక్కలు' అంటూ నిర్మాత విమర్శించారు.

‘వర్జిన్ బాయ్స్’ సినిమాపై వివాదం

దయానంద్(Dayanand) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys). గీతానంద్, మిత్రా శర్మ (Mitra Sharma)ప్రధాన పాత్రలో నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మించారు. ఇందులో శ్రీహాన్, జెన్నిఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షులు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన యూట్యూబర్లు, నెటిజన్లు కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఓ వ్యక్తి ఇందులో నటించిన హీరో, హీరోయిన్ల గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత రాజా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘అందరూ ఇండస్ట్రీ మీదనే బతుకుతున్నారు. కొంతమంది సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు పెట్టారు.

నిర్మాత రాజా దరపునేని హెచ్చరిక

ఇప్పుడు ‘వర్జిన్ బాయ్స్’ మూవీతో వాడు కూడా ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు. వేరే సినిమాల గురించి పెట్టలేదు. అవి చూసి పెట్టొచ్చు కదా. అతను యూట్యూబ్‌లో దారుణంగా మాట్లాడాడు. మా హీరోయిన్స్ అందం గురించి మాట్లాడే ముందు అతన్ని ముఖాన్ని అందంలో చూసుకోవాలి. అమ్మాయిల గురించి బాడీ షేమింగ్ చేస్తే ఇక అంతే బయటకు రారు తీహార్ జైలుకే వెళతారు. లిమిట్ క్రాస్ చేసి మాట్లాడినా రివ్యూలు పెట్టినా సెక్షన్స్ చాలా ఉన్నాయి. మనవాల్లు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు కానీ నాలాంటి తిక్కలోడు ఎవడో తగులుతాడు. నేను వచ్చేముందే సెంట్రల్ మినిస్టర్స్, ఆఫీసర్లతో ఏం చేయాలని మాట్లాడి వచ్చాను.

బాడీ షేమింగ్‌పై తీవ్ర స్పందన

కొద్దిగా అలర్ట్‌గా ఉండండి ఎట్ల పడితే అట్ల రాయకండి. తులసి తోటలో గంజాయి మొక్కల్లాంటి వాళ్ళు కొంత మంది జర్నలిస్టులు ఉన్నారు. వాల్లు అసలు జర్నలిస్టులే కాదు.. ఎక్కడో విరిగిపోయిన చైర్‌లో కూర్చొని వెబ్‌సైట్, యూట్యూబ్ పెట్టి వాడు సినిమా చూడకముందే ట్రైలర్, టీజర్ కట్ చేసి మరీ నిర్మాతలను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. పరాన్న జీవుల్లా బ్రతుకుతున్నారు. మా యాక్టర్స్ గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోము కఠిన చర్యలు తీసుకుంటాము. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిర్మాత జర్నలిస్టులపై చేసిన కామెంట్స్ వివాదాస్పద మవుతున్నాయి.

నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి వివాదాలు సర్వసాధారణం అయినప్పటికీ, ఈ విషయంపై చర్చ జరుగుతోంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.