
📌 Key Points
- పునర్నవి భూపాలం, హేమంత్ వర్మ మార్చి 21న వివాహం చేసుకున్నారు.
- పెళ్లి వేడుక నిశ్శబ్దంగా, నిజాయితీగా జరిగిందని పునర్నవి తెలిపారు.
- పెళ్లి అనేది ఆర్భాటం కాదని, అంతర్గత ప్రయాణమని పునర్నవి అభివర్ణించారు.
- స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఫోటోల ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు పునర్నవి.
బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం తన వివాహం గురించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. తన భర్త హేమంత్ వర్మతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ పెళ్లి గురించి తన ఆలోచనలను వెల్లడించారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
పునర్నవి, హేమంత్ వర్మ వివాహం
Punarnavi Bhupalam: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam) ఒకరు. ఈమె ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలు సిరీస్ లలో నటించిన ఈమె ఉన్నత చదువులు నిమిత్తం లండన్ వెళ్లిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా లండన్ లో చదువులు పూర్తి చేసుకున్న తర్వాత పునర్నవి పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
ఈమె తన ప్రియుడు హేమంత్ వర్మ(Hemanth Varma) అనే వ్యక్తితో మార్చి 21వ తేదీ ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత మొదటిసారి పునర్నవి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన పెళ్లి గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. పెళ్లి అంటే ఆర్భాటం కాదని,ఒక అంతర్గ ప్రయాణమని తెలిపారు. నేను ఎప్పుడూ నా పెళ్లి చాలా నిశబ్దంగా జరగాలని కోరుకున్నాను. నా పెళ్ళిలో నాకోసం ప్రేమ ఒక్కటే రాలేదు . ప్రేమతో పాటు రెండు కుటుంబాల ఆచార వ్యవహారాలను కూడా తీసుకువచ్చిందని తెలిపారు.
పునర్నవి ఎమోషనల్ పోస్ట్
నేను ఊహించినంత సులభంగా పెళ్లి జరగలేదని, పెళ్లి అనేది ప్రపంచానికి చాటిచెప్పే ప్రదర్శన కాదని, ఇది మన అంతర్గతంగా జరిగే ఒక అద్భుతం అని పునర్నవి తెలిపారు. ఈ పని నేను చేయగలను, నేను అతనిని ఎంపిక చేసుకుంటున్నానని నాకు నేను చెప్పుకోవడానికి నా ప్రశాంతత సరిపోయింది. కలసి ఉంటూనే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి, ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడుగా ఉండటానికి పెళ్లి అనేది వేదిక కావాలని పునర్నవి తెలిపారు. ఇది నేను ఊహించినంత సులభమైన పెళ్లి కాదు కానీ, ఎంతో నిజాయితీగా మనసుపెట్టి చేసుకున్న పెళ్లి. ఈ పెళ్లిని ఎంతో అందంగా చిత్రీకరించిన నా స్నేహితుడుకి ధన్యవాదాలు అంటూ ఈమె తన భర్త హేమంత్ వర్మతో కలిసి దిగిన ఫోటోలను ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు
ఇలా పెళ్లి తర్వాత ఈమె మొదటిసారి తన భర్తతో కలిసి దిగిన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లి గురించి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి గురించి ఎంతో లోతుగా ఆలోచిస్తూ పెళ్లి భావాన్ని ఇలా మాటల రూపంలో బయట పెట్టిందని చెప్పాలి. ఇలా పునర్నవి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక పునర్నవి పెళ్లి చేసుకున్న హేమంత్ వర్మ ఫోటోగ్రాఫర్ అని తెలుస్తుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
పునర్నవి తన పెళ్లి గురించి పంచుకున్న ఈ భావాలు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నిరాడంబరంగా, నిజాయితీగా తన జీవిత భాగస్వామితో కలిసి ముందుకు సాగాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.


