
📌 Key Points
- బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం పెళ్లికి సిద్ధం!
- నీలిరంగు చీరలో మెరిసిపోతున్న పునర్నవి పెళ్లికూతురిగా అదుర్స్!
- గత ఏడాది రివీల్ చేసిన పునర్నవి కాబోయే భర్త ఫోటోలు.
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పునర్నవి లగ్నపత్రిక ఫోటోలు!
బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె పెళ్లికి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ మీకోసం వచ్చేసింది. ఆ వివరాలు చూసేద్దాం!
పునర్నవి పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
Punarnavi Bhupalam: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆమె తాను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఫోటోలను రివీల్ చేసింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ గురించి పెద్ద వాళ్లకు చెప్పగా వాళ్ళు కూడా ఈ ఇద్దరు పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. దీంతో, ఈ ఇద్దరు ఇప్పుడు పెళ్ళికి రెడీ అయ్యారు.
ఇటీవలే గ్రాండ్ గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దానికి సంబందించిన ఫోటోలను కూడా పునర్నవి(Punarnavi Bhupalam) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు పెళ్ళికి కూడా వేలైనట్టుగా తెలుస్తోంది. తాజాగా వీరి పెళ్లికి సంబందించిన లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేసింది పునర్నవి. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నీలిరంగు చీరాలో పెళ్లి కూతురిలా మెరిసిపోతోంది పునర్నవి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వైరల్ అవుతున్న లగ్నపత్రిక ఫోటోలు
పెళ్లికూతురిగా పునర్నవి మెరుపులు!
పునర్నవి పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు వేచి ఉండండి!


