|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పూరి జగన్నాథ్ దెబ్బకు టాలీవుడ్ హీరోలు ఔట్! కోలీవుడ్ హీరో సూర్యతో నెక్స్ట్ మూవీ?

Published: 26-02-2026, 7:35 AM
షాకింగ్: పూరి జగన్నాథ్ దెబ్బకు టాలీవుడ్ హీరోలు ఔట్! కోలీవుడ్ హీరో సూర్యతో నెక్స్ట్ మూవీ?
  • పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ సినిమా షూటింగ్ పూర్తి.
  • సూర్యతో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ ఒక అద్భుతమైన కథను వినిపించారని సమాచారం.
  • మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సూర్య, పూరి జగన్నాథ్ సినిమా రానుందని సమాచారం.
  • తెలుగు హీరోలను కాదని కోలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ సినిమాను పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు సూర్యతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ పూర్తి

Puri jagannadh:  టాలీవుడ్ డేరింగ్ అండర్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannadh) ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ హిట్ సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఈయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ కు అవకాశాలు కూడా పూర్తిగా కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ నిర్మాతగా మారి పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమాలో కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోలు కూడా ఈయనతో సినిమా చేయటానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు.

ఇలా టాలీవుడ్ హీరోలతో సినిమా చేసే అవకాశం రాకపోయినా పూరి జగన్నాథ్ మాత్రం కోలీవుడ్ హీరోలతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో కలిసి స్లమ్ డాగ్(Slum Dog) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో పూరి జగన్నాథ్ ఎంతో బిజీగా ఉన్నారు.

సూర్యతో సినిమాకు పూరి జగన్నాథ్ సన్నాహాలు

విజయ్ సేతుపతి సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి ఇటీవల విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల కాకుండానే పూరి జగన్నాథ్ మరో కోలీవుడ్ స్టార్ హీరోను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ ఒక అద్భుతమైన కథతో నటుడు సూర్య (Suriya)వద్దకు వెళ్లడంతో కథ విన్న సూర్య ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.

తెలుగు హీరోలను పక్కన పెట్టేశారా?

తెలుగు హీరోలను పక్కన పెట్టిన పూరి?

పూరి జగన్నాథ్ ఇలా వరుసగా కోలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈయన తెలుగు హీరోలను పూర్తిగా పక్కన పెట్టేశారా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది తెలుగు డైరెక్టర్ లు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తెలుగు హీరోలను కాదని తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో పలు విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మరి సూర్య పూరి జగన్నాథ్ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

పూరి జగన్నాథ్ వరుసగా కోలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తుండటం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తిరిగి తెలుగు హీరోలతో ఎప్పుడు సినిమా చేస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.