
📌 Key Points
- పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన ‘స్లమ్ డాగ్’ సినిమా విడుదల వాయిదా.
- డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపకపోవడంతో, ఓటీటీ డీల్ పూర్తి కాకపోవడంతో విడుదల ఆలస్యం.
- విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
- ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా, టబు కీలక పాత్రలో నటించారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘స్లమ్ డాగ్’ సినిమా విడుదల వాయిదా పడింది. డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపకపోవడం, ఓటీటీ డీల్ కూడా పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యమవుతోంది.
స్లమ్ డాగ్ విడుదల ఎందుకు ఆలస్యం?
Slum Dog: టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)ఒకరు. పూరి జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే పక్కా బ్లాక్ బాస్టర్ హిట్ అనే టాక్ ఉండేది ఎన్నో అద్భుతమైన సినిమా కథలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలందరికి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన ఘనత పూరి జగన్నాథ్ కి ఉంది. ఇలా కల్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉందని చెప్పాలి. కనీసం ఈయనకు తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలు సినిమా అవకాశాలు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు.
ఒకానొక సమయంలో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పూరి జగన్నాథ్ సినిమాలు ఇటీవల కాలంలో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. తద్వారా వరుస డిజాస్టర్లు వెంటాడడంతో ఈయనతో సినిమాలు చేయడానికి కూడా హీరోలు ముందుకు రాలేదు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తమిళ హీరో విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యి చాలాకాలం అయింది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
బయ్యర్లు ఆసక్తి చూపకపోవడానికి కారణం?
ఇలా సినిమా షూటింగ్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతున్న ఈ సినిమా విడుదల గురించి ఏ విధమైనటువంటి ప్రకటన వెల్లడించకపోవడంతో అభిమానులకు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే స్లమ్ డాగ్ సినిమా విడుదల కాకపోవడానికి కారణం లేకపోలేదని చెప్పాలి. ఇటీవల పూరి జగన్నాథ్ సినిమాలోని ప్రేక్షకులను వరుసగా నిరాశ పరుస్తున్న నేపథ్యంలో స్లమ్ డాగ్ కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాలేదు అలాగే ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా పూర్తికాని నేపథ్యంలో విడుదలకు నోచుకోలేకపోయిందని తెలుస్తోంది.
స్లమ్ డాగ్ సక్సెస్ చాలా కీలకం..
పూరి జగన్నాథ్ సైలెంట్ ఎందుకు?
మరి ఈ సినిమా కొనడానికి బయ్యర్లు ముందుకు వస్తే తప్ప ఈ సినిమా ఇప్పుడప్పుడే విడుదల కాదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ కూడా సైలెంట్ గానే ఉన్నారు ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ వెల్లడించకపోవడం గమనార్హం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా, సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రలో నటించారు అలాగే సీనియర్ నటి టబు సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఇలా సీనియర్ నటీనటులు ఉన్నప్పటికీ ఈ సినిమా విడుదలకు మాత్రం అడ్డంకులు ఏర్పడటంతో పూరి అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవడం అనేది పూరి జగన్నాథ్ సినీ కెరియర్ కు చాలా కీలకం అని చెప్పాలి.
మొత్తానికి, ‘స్లమ్ డాగ్’ విడుదల కావడానికి బయ్యర్లు ముందుకు వస్తేనే సాధ్యపడుతుంది. పూరి జగన్నాథ్ ఈ సినిమా విషయంలో సైలెంట్ గా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.


