|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండెలపై చేయి వేసుకుని పూరి జగన్నాథ్ సంచలన ప్రకటన: బాలయ్యే నా ఫేవరెట్ హీరో!

Published: 24-05-2026, 4:31 PM
గుండెలపై చేయి వేసుకుని పూరి జగన్నాథ్ సంచలన ప్రకటన: బాలయ్యే నా ఫేవరెట్ హీరో!
  • అన్ స్టాపబుల్ షోలో పూరి జగన్నాథ్ సంచలన ప్రకటన!
  • గుండెలపై చేయి వేసి బాలయ్యే ఫేవరెట్ హీరో అని పూరి వెల్లడి!
  • ఛార్మి కౌర్ వల్లే పూరి కనెక్ట్స్ మళ్ళీ స్టార్ట్ చేశాన్న పూరి!
  • బాలయ్య-పూరి కాంబోపై భారీ అంచనాలు, ఫ్యాన్స్ ఉత్సాహం!

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్! మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటసింహం బాలకృష్ణ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. బాలయ్యపై పూరి మనసులో మాట టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎక్స్‌క్లూజివ్ వివరాలు మీకోసం!

పూరి మనసులో మాట: బాలయ్యతో బంధం!

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎందరో హీరోలని స్టార్లుగా మార్చారు. అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. పూరి జగన్నాధ్ కెరీర్ లో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో పూరి తెరకెక్కించిన చిత్రాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. కొత్త తరం దర్శకుల హవా ముందు పూరి నిలబడలేకపోతున్నారు.

పూరి జగన్నాధ్ నిర్మాతగా కూడా రాణించారు. వైష్ణో అకాడమీ అనే బ్యానర్ లో పోకిరి, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రాలని పూరి నిర్మించారు. కొన్ని ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాధ్ భారీ స్థాయిలో డబ్బు కోల్పోయారు. ఆ తర్వాత ప్రొడక్షన్ జోలికి వెళ్ళలేదు అని పూరి తెలిపారు. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పూరి పాల్గొన్న సంధర్భంగా ఈ విషయాలు రివీల్ చేశారు.

ఛార్మి వల్లే ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేశా!

ప్రొడక్షన్ లో డబ్బు పోయాక దాని జోలికి వెళ్ళలేదు. ప్రొడక్షన్ అనేది సపరేట్ గేమ్. కథలు రాస్తూ దర్శకత్వం చేస్తూ ప్రొడక్షన్ కూడా మేనేజ్ చేయడం అంత సులభం కాదు అని పూరి అన్నారు. అయితే మళ్ళీ ఏ ధైర్యంతో పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ స్థాపించావు అని బాలయ్య ప్రశ్నించగా పూరి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జ్యోతి లక్ష్మి సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీలో నటిస్తూ, ప్రొడక్షన్ పనులు కూడా ఛార్మినే చూసుకుంది. చాలా అద్భుతంగా చేసింది. ఆమెకి సినిమా నిర్మాణం అంటే చాలా ఇష్టం.

ఛార్మిని చూసి నాకు కూడా కాన్ఫిడెన్స్, ధైర్యం వచ్చాయి అని పూరి అన్నారు. నిర్మాణ పనులు ఆమె చూసుకుంటుంది కాబట్టి ఆ ధైర్యంతో బ్యానర్ స్థాపించినట్లు పూరి జగన్నాధ్ తెలిపారు.

“నా ఫేవరెట్ హీరో బాలయ్యే!” – పూరి సంచలనం!

బాలయ్య పూరిని మరో ఆసక్తికర ప్రశ్న అడిగారు. నీవు వర్క్ చేసిన హీరోల్లో ఎవరంటే నీకు బాగా ఇష్టం అని అడిగారు. ఏఈ ప్రశ్నకు పూరి ఓపెన్ గా సమాధానం ఇచ్చారు. గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా, నాకు బాలయ్య బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అని పూరి జగన్నాధ్ అక్కడున్న ఆడియన్స్ కి చెప్పారు. దీనితో బాలయ్య లేచి వచ్చి పూరిని హగ్ చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో పైసా వసూల్ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

బాలయ్యపై పూరి జగన్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీశాయి. ఈ మాస్ కాంబో నుంచి మరో ప్రాజెక్ట్ వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.