|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పుష్ప స్టార్ ఇంట్లో శుభవార్త! భార్య ధన్యత బేబీ బంప్ ఫోటోలు వైరల్.. త్వరలో డాడీ ధనుంజయ!

Published: 30-04-2026, 9:35 AM
పుష్ప స్టార్ ఇంట్లో శుభవార్త! భార్య ధన్యత బేబీ బంప్ ఫోటోలు వైరల్.. త్వరలో డాడీ ధనుంజయ!
  • డాలీ ధనుంజయ భార్య ధన్యత ప్రెగ్నెన్సీ వార్తను తెలియజేశారు.
  • తాజాగా ధన్యత బేబీ బంప్ ఫోటోలను ధనుంజయ షేర్ చేశారు.
  • పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.
  • త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు.

పుష్ప నటుడు డాలీ ధనుంజయ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన భార్య ధన్యత గర్భవతి అని, త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని తెలిపారు. తాజాగా ధన్యత బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుష్ప నటుడికి శుభవార్త!

Daali Dhananjay: పుష్ప సినిమా ద్వారా విలన్ గా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో డాలీ ధనుంజయ(Daali Dhananjay) ఒకరు.డాలీ ధనుంజయ అంటే టక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ జాలి రెడ్డి అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. ఇలా పుష్ప(Pushpa) సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుంజయ గత ఏడాది ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈయన ధన్యత(Dhanyatha) అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు ఈమె వృత్తిపరంగా వైద్యురాలు. ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ధనంజయ గత కొద్ది రోజుల క్రితం ఒక శుభవార్తను తెలియజేశారు.

మేము ముగ్గురం కాబోతున్నాము అంటూ తన భార్య ధన్యత ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే తాజాగా ధనుంజయ సోషల్ మీడియా వేదికగా తన భార్య ధన్యత బేబీ బంప్(Baby Bump) ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి. తన భార్య నిండు గర్భంతో మెటర్నటి ఫోటోషూట్ నిర్వహించారు. ఇందులో భాగంగానే ఈయన తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ తమ ప్రపంచం మరింత పెరిగిపోతుంది అంటూ తమ ఆనందాన్ని తెలియజేశారు. ఇకపై తాను డాలీ ధనుంజయ కాదని డాడీ ధనుంజయ కాబోతున్నాను అంటూ ఈయన తెలియజేశారు.

వైరల్ అవుతున్న ధన్యత బేబీ బంప్ ఫోటోలు

ఈ విధంగా ధనుంజయ తన భార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధనుంజయ కన్నడ నటుడు అనే సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా ధనుంజయ కన్నడ భాషకు మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప, పుష్ప 2 సినిమాలలో కీలక పాత్రలో నటించిన ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం హలగలి, 666 ఆపరేషన్ డ్రీమ్ ప్రాజెక్ట్, జింగో, అన్నా ఫ్రమ్ మెక్సికో, ఉత్తరకాండ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

కెరీర్, వ్యక్తిగత జీవితంలో ధనుంజయ

ఇలా ఒక వైపు వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూనే మరోవైపు తన కెరియర్ పరంగా ధనంజయ ఎంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ జంట అతి త్వరలోనే తల్లితండ్రులుగా ప్రమోట్ కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ముందుగానే ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ధన్యత బేబీ బంప్ ఫోటోలు చూస్తుంటే అతి త్వరలోనే ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది.

డాలీ ధనుంజయ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. త్వరలో తండ్రి కాబోతున్న ధనుంజయకు, ధన్యతకు అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి ప్రపంచం మరింత పెరగాలని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.