
పుష్ప సినిమాతో సూపర్ హిట్ జంటగా మారిన అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న మరోసారి కలిసి నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వారి పాత్రలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది.
Key Points
అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న మరోసారి కలిసి నటించబోతున్నారు.
అట్లీ దర్శకత్వంలో వచ్చే తదుపరి చిత్రంలో వీరు కనిపించనున్నారు.
ఈ సినిమాలో దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి బాలీవుడ్ నటీమణులు కూడా నటిస్తున్నారు.
రష్మిక మందన్న పాత్ర కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.
పుష్ప జంట మళ్ళీ కలిసి?
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి `పుష్ప` చిత్రాల్లో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో రష్మిక మందన్నాపేరు వినిపిస్తుంది.
అట్లీ చిత్రంలో రష్మిక?
ఈ సినిమాలో బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, వీరితో పాటు సౌత్ నటి రష్మిక మందన్న కూడా చేరారు. ఆమె కూడా హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం.
ఒకే సినిమాలో నలుగురు నటిస్తుండటంతో, ఎవరి పాత్ర ఎలా ఉంటుంది, ఎవరి పాత్ర వ్యవధి ఎంత అనే లెక్కలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఇందులో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
నలుగురు హీరోయిన్లు!
లాస్ ఏంజలీస్‌లో ఈ సినిమా కోసం రష్మిక మందన్న లుక్ టెస్ట్, బాడీ స్కాన్ చేయించుకున్నారు. అట్లీ రష్మిక మందన్న పాత్ర కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు.
పుష్పరాజ్- శ్రీవల్లిగా `పుష్ప`, `పుష్ప 2` సినిమాలతో అల్లు అర్జున్-రష్మిక మందన్న జంట ఇప్పటికే టాలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరి కాంబినేషన్‌కి మంచిక్రేజ్ ఉంది. అదే ఇప్పుడు అట్లీ మూవీకి కలిసి రాబోతుందని సమాచారం.
అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంట అభిమానులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


