|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రుక్మిణి వసంత్: రష్మిక అడుగుజాడల్లో! విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటారా?

Published: 11-02-2026, 3:05 AM
రుక్మిణి వసంత్: రష్మిక అడుగుజాడల్లో! విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటారా?
  • కన్నడ నుంచి టాలీవుడ్‌లో రాణిస్తున్న రుక్మిణి వసంత్.
  • రష్మిక మందన్న బాటలో పయనిస్తున్న రుక్మిణి వసంత్‌పై విమర్శలు.
  • ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి.
  • ఎన్టీఆర్, రిషిబ్ శెట్టి సినిమాల్లో అవకాశాలు.

కన్నడ నటి రుక్మిణి వసంత్ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే రష్మిక మందన్న బాటలో ఆమె పయనిస్తుండటం, ఆమెపై విమర్శలకు దారితీస్తుందా అనే చర్చ జరుగుతోంది.

రుక్మిణి వసంత్: టాలీవుడ్ ఎంట్రీ, ఎదుగుదల

Rukmini Vasanth: కర్ణాటక నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఒక్కో హిట్ సినిమాలో నటిస్తూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు.. అందులో ముఖ్యంగా మనకు వినిపించే పేరు రష్మిక మందన్న.. తెలుగులో వరుస చిత్రాలతో స్టార్ గా ఎదిగింది.. ఇప్పుడు ఇండస్ట్రీ క్రష్ గా మారింది. ఈమె కన్నడలో సినిమాలు చేయకపోగా తెలుగులో కేవలం సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజెస్ ను సొంతం చేసుకుంటుందని కన్నడీలు ఆమెని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి విమర్శలు ఎదురైనా సరే వాటి అన్నిటిని ఎదుర్కొంటూ స్టార్ ఇమేజ్ ని కొనసాగిస్తుంది. ఈమధ్య బాలీవుడ్ లో కూడా వరుస హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. ​ఇప్పుడు అదే బాటలో రుక్మిణి వసంత్ కూడా కనిపిస్తోంది. మరి ఈమెకు అదే విమర్శలు తప్పేలా లేవు.. అసలు ఈ అమ్మడు ఏం చేసింది అన్నది ఒకసారి తెలుసుకుందాం..

ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ఇండస్ట్రీలో వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎన్టీఆర్, రిషిబ్ శెట్టి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ‘కాంతార చాప్టర్ 1’తో కన్నడలోనూ స్టార్ హోదాను దక్కించుకుంది. ఇక తెలుగులో ఆమెకు పెరుగుతున్న డిమాండ్ చూస్తుంటే, త్వరలోనే ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన ఆశ్చర్యం పడనవసరం లేదు.. ఇక్కడ స్టార్ స్టేటస్ వస్తే బాలీవుడ్ ఆఫర్స్ రావడం ఖాయం.. అదే ఆమెను విమర్శల పాలు చేస్తుందా అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

రష్మికను అనుసరిస్తున్న రుక్మిణి.. విమర్శలు తప్పవా?

బాలీవుడ్ అవకాశాలు, కన్నడలో నిరసనలు

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ లు ఇక్కడ స్టార్ డం ను సొంతం చేసుకుంటున్నారు. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని పొందుతున్నారు.. నిన్ను మొన్నటి వరకు రష్మిక మందన్న తెలుగులో బిజీ హీరోయిన్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీగా మారింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రుక్మిణి వసంత్ కూడా తెలుగులో బిజీ అవుతుంది. ఈమె జోరుని చూస్తుంటే కొన్ని సినిమాలతోనే స్టార్ ఇమేజ్ ను అందుకోవడం ఖాయం. ఈమె క్రేజ్ ని బాలీవుడ్ క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అయితే రష్మిక లాగా కన్నడ ఇండస్ట్రీని పూర్తిగా వదిలేయడం తప్పు అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి రుక్మిణి వసంత్ ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నా డ్రాగన్ మూవీలో నటిస్తుంది..

మొత్తానికి రుక్మిణి వసంత్ టాలీవుడ్‌లో తన సత్తా చాటుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి. విమర్శలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.