|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది: రామ్ చరణ్, జాన్వీల మెగా ప్రాజెక్ట్! ఏఆర్ రెహమాన్ మ్యాజిక్‌తో విలేజ్ డ్రామా కొత్త పుంతలు?

Published: 28-12-2025, 8:51 AM
పెద్ది: రామ్ చరణ్, జాన్వీల మెగా ప్రాజెక్ట్! ఏఆర్ రెహమాన్ మ్యాజిక్‌తో విలేజ్ డ్రామా కొత్త పుంతలు?
  • రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో ‘పెద్ది’ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది.
  • బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
  • తదుపరి షెడ్యూల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌పై అతిపెద్ద పాట చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు.
  • ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో భారీ ట్రెండ్ సృష్టించింది.

రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం నుండి తాజాగా ఓ కీలక అప్‌డేట్ వెలువడింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం నుండి తాజా పాట చిత్రీకరణ వార్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

రామ్ చరణ్ ‘పెద్ది’లో కొత్త లుక్, జాన్వీ జోడి

Peddi:ప్రముఖ హీరో రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అయితే ఈ మధ్య ఆ ట్యాగ్ ను ఆయన తొలగించినా.. తన నటనతో మాత్రం అందరిని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్న చిత్రం పెద్ది. భారీ అంచనాల మధ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన “చికిరి చికిరి” సాంగ్ యూట్యూబ్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఇటీవలే ఈ సినిమా ఢిల్లీలో క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అలాంటి ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ అభిమానులలో ఆసక్తిని కలిగిస్తోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తదుపరి షెడ్యూల్లో రామ్ చరణ్ , జాన్వీ కపూర్ పై ఒక అతిపెద్ద సాంగ్ షూట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ మరోసారి తన గ్రేస్ స్టెప్పులతో అదరగొట్టబోతుండగా.. జాన్వీ కపూర్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది అని సమాచారం. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్న మ్యూజిక్.. ఈ సినిమాకు ఒక సెన్సేషన్ అవుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం: సినిమాకు హైలైట్

కొత్త పాట షూట్: సినిమాపై పెరిగిన అంచనాలు

ఎందుకంటే బుచ్చిబాబు మార్కు విలేజ్ డ్రామా కి ఏ ఆర్ రెహమాన్ క్లాసిక్ టచ్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని.. గా అందుకే ఈ పాట సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు రామ్ చరణ్ పాత్ర గత చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని కూడా చిత్రవర్గాలు చెబుతున్నాయి మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. రామ్ చరణ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే గతంలో సుకుమార్ తో రంగస్థలం సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.

ఈ భారీ ప్రాజెక్ట్ రామ్ చరణ్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఏఆర్ రెహమాన్ క్లాసిక్ టచ్, బుచ్చిబాబు మార్కు విలేజ్ డ్రామాతో ‘పెద్ది’ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.