|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

R Madhavan: నెలకు ఆరున్నర లక్షలా?.. ఖరీదైన ఫ్లాట్‌ తీసుకున్న స్టార్ హీరో భార్య!

Published: 20-06-2025, 11:12 AM
R Madhavan: నెలకు ఆరున్నర లక్షలా?.. ఖరీదైన ఫ్లాట్‌ తీసుకున్న స్టార్ హీరో భార్య!

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ భార్య సరిత ముంబైలోని బాంద్రాలో నెలకు ఆరున్నర లక్షల రూపాయలకు ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ఈ ఖరీదైన ఫ్లాట్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

ఆర్. మాధవన్ భార్య సరిత ముంబైలోని బాంద్రాలో నెలకు రూ.6.50 లక్షలకు ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు.

2

రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు సమాచారం.

4

మాధవన్ తాజాగా 'హిసాబ్ బరాబర్' సినిమాలో నటించారు.

బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్

ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయలు అద్దెకు ఇల్లు తీసుకోవడం అంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కానీ సినీతారల విషయానికొస్తే ఈ లెక్క మారుతుంది. వారు మినిమం లక్షకు పైగానే రెంట్‌ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద స్టార్స్ అయితే రెండు, మూడు లక్షల పైమాటే. అయితే తాజాగా స్టార్ హీరో ఆర్ మాధవన్‌ భార్య సరిత ఏకంగా ఆరున్నర లక్షలకు ఓ అపార్ట్‌మెంట్‌ను లీజ్‌కు తీసుకుంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో నెలకు దాదాపు రూ.6.50 లక్షలు చెల్లించేలా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబయిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. ఈ ఏరియాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాసమున్నారు.

అద్దె మరియు సెక్యూరిటీ డిపాజిట్

ఇక మాధవన్ సినిమాల విషయానికొస్తే మా అనే చిత్రంలో నటించారు. కాజోల్ లీడ్ రోల్‌ పోషించింది.  ఈ చిత్రంలో కేవలం  అతిథి పాత్రలో కనిపిస్తాడు. దీంతో పాటు ఫాతిమా సనా షేక్‌ జంటగా ఆప్ జైసా కోయి అనే సినిమాలో కూడా నటించారు. ఈ రొమాంటిక్ సినిమా జూలై 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. మాధవన్ చివరిసారిగా అక్షయ్ కుమార్, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం కేసరి చాప్టర్-2లో కనిపించాడు.

మాధవన్ సినిమా కెరీర్

అంతే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిసాబ్‌ బరాబర్‌ విడుదలైంది . అశ్వని ధర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్‌ నితిన్‌ ముకేశ్‌, రష్మీ దేశాయ్‌, ఫైజల్‌ రషీద్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్‌ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది.

ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ అద్దెకు తీసుకోవడం మాధవన్ కుటుంబ వైభవాన్ని చాటుతోంది. ఆయన సినిమా ప్రస్థానం కూడా విజయవంతంగా సాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.