|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాకాస మూవీ: కోటలో రాక్షసుడు! సంగీత్ శోభన్ మాస్ ట్రీట్! నిహారిక కొణిదెల మరో బ్లాక్ బస్టర్ హిట్?

Published: 03-04-2026, 5:05 AM
రాకాస మూవీ: కోటలో రాక్షసుడు! సంగీత్ శోభన్ మాస్ ట్రీట్! నిహారిక కొణిదెల మరో బ్లాక్ బస్టర్ హిట్?
  • సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, వెన్నెల కిశోర్ పంచ్ డైలాగులు సినిమాకు హైలైట్!
  • నిహారిక కొణిదెల నిర్మాణంలో గ్రాండ్ విజువల్స్, అనుదీప్ దేవ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్!
  • హారర్, కామెడీ కలయికతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టే రాకాస!
  • ఏప్రిల్ 3న విడుదలైన రాకాస.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టేందుకు సిద్ధం!

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక సంచలన మూవీ రాబోతుంది! నిహారిక కొణిదెల నిర్మాణంలో, సంగీత్ శోభన్ హీరోగా నటించిన ‘రాకాస’ మూవీ విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం రండి!

రాకాస మూవీ స్టోరీ లైన్ ఏంటి?

Raakaasa Review: హారర్ ప్లస్ కామెడీ జోనర్ అంటే క్రేజే వేరు. ఈ జోనర్ లో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను నవ్విస్తూనే భయపెడతాయి. మరి అదే జోనర్ లో ఈ రోజు రిలీజైన రాకాస ఎలా ఉంది? ప్రొడ్యూసర్ గా మెగా డాటర్ మరో హిట్ కొట్టిందా? అన్నది రాకాస రివ్యూలో చూసేయండి.

నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను తదితరులు

ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 3, 2026

సంగీత్ శోభన్ నటన ఎలా ఉంది?

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రొడ్యూసర్ గా ఫస్ట్ స్టెప్ లోనే సక్సెస్ అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల . ఆమె నిర్మించిన రెండో సినిమా ‘ రాకాస ’. హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (ఏప్రిల్ 3) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హారర్ కామెడీ జోనర్ కలిసొచ్చిందా? అన్నది రాకాసా రివ్యూ లో చూసేయండి.

వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి సొంత ఊరికి వస్తాడు. తన చిన్ననాటి ప్రియురాలు కోసం వెతుకుతాడు. కానీ ఆమె దూరమవుతుంది. ఆ పరిస్థితుల్లో సుబ్బలక్ష్మి (నయన్ సారిక) అతనికి దగ్గరవుతుంది. ఆ గ్రామంలో సోము (వెన్నెల కిశోర్) హత్యకు గురవుతాడు. ఈ కేసులో వీరబాబు ఇరుక్కుంటాడు.

అనుకోని పరిస్థితుల్లో కోటలోని రాక్షసుడికి బలిగా వీరబాబు వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాక్షసుడి కథ ఏంటీ? వీరబాబు ప్రాణాలతో బయటపడ్డాడా? అన్నదే రాకాస మూవీ స్టోరీ.

రాక్షసుడిని పరిచయం చేస్తూ సినిమా మొదలెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. వీరబాబు ఎంట్రీతో కామెడీ జోరందుకుంటుంది. ఫస్టాఫ్ లో గెటప్ శ్రీను, సెకండాఫ్ లో వెన్నెల కిశోర్ తో కలిసి సంగీత్ శోభన్ చేసిన కామెడీ సినిమాను నిలబెట్టింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.

నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యారా?

అయితే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఈ కాలంలోనూ కోటలు, రాక్షసులు, నరబలి అనేది లాజిక్ కు దూరంగా అనిపిస్తుంది. కానీ లాజిక్ లు పక్కనపెట్టి చూస్తే రాకాస సినిమా ఫుల్ టైమ్ పాస్ మూవీ.

వెన్నెల కిశోర్, గెటప్ శ్రీనులతో కలిసి సంగీత్ కామెడీ ఈ సినిమాకు అతిపెద్ద బలం. నయన సారిక తన పాత్రను సమర్థంగా పోషించింది. బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

హారర్ సినిమాల్లో బీజీఎం కీలకం. ఈ రాకాస మూవీకి అనుదీప్ దేవ్ తన మ్యూజిక్ తో మరింత ప్రత్యేకత తీసుకొచ్చాడు. ఇక ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గురించి చెప్పుకోవాలి. లిమిటెడ్ బడ్జెట్ లోనే గ్రాండ్ లెవెల్ లో తాను అనుకున్న విధంగా, తెరపై గొప్పగా కనిపించేలా రాకస సినిమాను నిర్మించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రిలీజ్ కు ముందు ప్రచారాన్ని గట్టిగా నిర్వహించి అందరూ రాకాస గురించి మాట్లాడుకునేలా చేసింది.

రాకాస మూవీ హారర్ మరియు కామెడీ జోనర్ లో ప్రేక్షకులను అలరించే చిత్రంగా నిలిచింది. సంగీత్ శోభన్ నటన, నిహారిక నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.