
📌 Key Points
- నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘రాకాసా’ సినిమా నిర్మాణం.
- సంగీత్ శోభన్, నయాన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫాంటసీ కామెడీ.
- మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకాసా’ గ్లింప్స్ విడుదల.
- ఏప్రిల్ 3, 2026న ‘రాకాసా’ సినిమా విడుదల కానుంది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘రాకాసా’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న విడుదల కానుంది.
నిర్మాతగా నిహారిక కొణిదెల
Raakaasaa Glimpse: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థను స్థాపించి 10 సంవత్సరాలవుతుంది ఇప్పటికీ వెబ్ సిరీస్ లను నిర్మించిన నిహారిక తన నిర్మాణ సంస్థలో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో నిహారిక అంతే ఉత్సాహంతో తన రెండో సినిమాని కూడా ప్రకటించారు. సంగీత్ శోభన్ (Sangeeth Sobhan)హీరోగా రాకాసా(Raakaasaa) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ విడుదల చేయగా తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు.
మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయాన్ సారిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాంటసీ కామెడీ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్ విడుదల చేయగా ఇది కాస్త ప్రేక్షకులను భయపడే విధంగా ఉందని చెప్పాలి. ఈ గ్లింప్స్ వీడియోలో సంగీత్ శోభన్ ను వీరుడిగా పరిచయం చేశారు .అయితే ఆయన ఉన్నఫలంగా వలలో చిక్కుకుపోవడంతో ఎదురయ్యే పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో చూస్తుంటే సంగీత్ మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.ఈ గ్లింప్స్ వీడియో చూస్తుంటేనే హీరో ఖాతాలో మరొక హిట్ పడుతుందని చెప్పాలి. ఈ సినిమాను ఏప్రిల్ 3,2026 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.
‘రాకాసా’గా సంగీత్ శోభన్
ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తున్నా నేపథ్యంలో మెల్లిగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతూ సినిమా నుంచి పలు అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ ఇప్పటికే పలు సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే రాకాసా సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెల్లడి కానున్నాయి. ఇక ఈ సినిమాని నిహారికతో పాటు జీ స్టూడియోస్ బాగాస్వామ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి సినిమాతో ఎంత మంచి సక్సెస్ అందుకున్న నిహారిక ఈ సినిమా ద్వారా కూడా అంతే సక్సెస్ అందుకోవాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటనపై ఆసక్తితో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయిన ఈమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు. వెబ్ సిరీస్ ల ద్వారా నిర్మాతగా సక్సెస్ అందుకోవడంతో సినిమాలపై దృష్టి సారించి ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగా కొనసాగుతున్నారు. కమిటీ కుర్రోళ లాంటి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిహారిక రెండో సినిమాని కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
భయపెట్టే గ్లింప్స్ విడుదల
మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్న నిహారిక, ఈ సినిమాతో కూడా అదే విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వెల్లడికానున్నాయి.


