
📌 Key Points
- నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్!
- సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా హారర్ కామెడీ ఫాంటసీ ట్రీట్!
- ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్.. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా!
- దర్శకురాలు మానస శర్మ టేకింగ్ కు ప్రేక్షకులు ఫిదా.. కలెక్షన్ల వర్షం!
నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన రాకాస మూవీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. హారర్ కామెడీ ఫాంటసీ మూవీగా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో నిహారిక మరో సక్సెస్ అందుకున్నారు.
నిర్మాతగా నిహారిక సక్సెస్
Raakaasa Success Meet Event Niharika Sangeeth Nayan Manasa Speech: నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ కామెడీ ఫాంటసీ సినిమా రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్‌గా నటించిన రాకాస సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిహారిక, సంగీత్, నయన్, మానస కామెంట్స్ తెలుసుకుందాం.
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.
సంగీత్, నయన్ లవ్ ట్రాక్ అదిరింది
ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. “‘రాకాస’ మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా ‘రాకాస’ని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది” అని అన్నారు.
“‘రాకాస’ రెస్పాన్స్ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే నా ఫ్యామిలీ. ప్రీమియర్ల నుంచే మాకు అద్భుతమైన ఆదరణ దక్కింది. అన్ని వర్గాల ఆడియెన్స్ మా మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ సక్సెస్ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది” అని హీరోయిన్ నయన్ సారిక పేర్కొంది.
థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు
“చాలా చోట్ల ఆడియెన్స్ పగలబడి నవ్వేస్తున్నారు. అంతలా ప్రేక్షకులు మా సినిమా ఆస్వాదిస్తూ చూస్తుంటే సంతోషంగా ఉంది. మా సినిమాని ఇంకా ఇలానే ఆదరిస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను” అని దర్శకురాలు మానస శర్మ ఆకాంక్షించారు.
అలాగే, జీ స్టూడియో కంటెంట్ హెడ్ దివ్య మాట్లాడుతూ .. “‘రాకాస’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్‌కి మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి” అని అన్నారు.
రాకాస మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఆశిద్దాం.


