
📌 Key Points
- రాశి ఖన్నా త్వరలో పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటించనున్నారు.
- ప్రస్తుతం రాశి ఖన్నా పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించారు.
- సాయి ధరమ్ తేజ్‌తో రాశి ఖన్నా ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- పెళ్లి చేసుకోవడానికి తనకు సమయం లేదని రాశి ఖన్నా స్పష్టం చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తనకే తెలియదని అన్నారు. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు.
రాశి ఖన్నా పెళ్లిపై వస్తున్న పుకార్లు
Raashii Khanna: రాశి కన్నా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాశిఖన్నా(Raashii Khanna) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాశిఖన్నా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ పెళ్ళెప్పుడు? మీరు కూడా ప్రేమ వివాహం చేసుకుంటున్నారా అంటూ ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు రాశి కన్నా సమాధానం చెబుతూ నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయం నాకు కూడా తెలియదని తెలిపారు. ప్రస్తుతం తాను సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నానని పెళ్లికి ఇప్పుడు నా దగ్గర సమయం లేదు అంటూ ఈమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి
రాశిఖన్నా కంటే కూడా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు కానీ ఈమె మాత్రం నా పెళ్లి గురించి నాకు తెలియదు అంటూ సమాధానం చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే గత కొంతకాలంగా రాశీ కన్నా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . ఈమె మెగా హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej)ప్రేమలో ఉన్నారని ఈమె కూడా మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
సాయి దుర్గ తేజ్ తో రాశీ కన్నా పెళ్లి?
సాయి ధరమ్ తేజ్‌తో ప్రేమ వార్తలపై స్పందన
ఇటీవల అల్లు శిరీష్ పెళ్లి వేడుకలలో భాగంగా రాశి ఖన్నా పాల్గొనడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె సాయి దుర్గా తేజతో పాటు సాయి దుర్గ తేజ్ తల్లితో కూడా చాలా చనువుగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇలా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు రాశీ కన్నా తనదైన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.
రాశి ఖన్నా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లికి సమయం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


