|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాధికా ఆప్టే సంచలన నిర్ణయం! ఇకపై ఆ పనులు చేయనంటూ షాకింగ్ కామెంట్స్!

Published: 14-01-2026, 3:30 AM
రాధికా ఆప్టే సంచలన నిర్ణయం! ఇకపై ఆ పనులు చేయనంటూ షాకింగ్ కామెంట్స్!
  • రాధికా ఆప్టే సంచలన నిర్ణయం: ఇకపై పని గంటలపై కఠిన నిబంధనలు!
  • వారానికి ఐదు రోజులే షూటింగ్, తప్పనిసరిగా ఒక రోజు సెలవు ఉండాలని షరతు!
  • చిన్న సినిమాలకు మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని స్పష్టీకరణ
  • రోజుకు 12 గంటలే పని, ప్రయాణం, మేకప్ అన్నీ కలిపే లెక్క!

టాలీవుడ్ నటి రాధికా ఆప్టే సంచలన నిర్ణయంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏం నిర్ణయం తీసుకున్నారు? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? చూద్దాం!

పని గంటలపై రాధికా ఆప్టే సంచలన నిర్ణయం

నటి రాధికా ఆప్టే(Radhika Apte) అందాల ఆరబోతకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయి, దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో నటిస్తూ దూసుకుపోతుంది. నటన, గ్లామర్ రెండింటిలోనూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న రాధికా.. ఇప్పుడు తల్లి అయినప్పటికీ కెరీర్‌లో ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా ముందుకు సాగుతోంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల విడుదలైన ‘సాలీ మోహబత్’ (Sali Mohabbat)చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించిన రాధికా.. తన పర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ పూర్తిగా పీక్ ఫేజ్‌లో కొనసాగుతోందని చెప్పాలి. ఇక సినిమాలతో పాటు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

పిల్లల కోసం కెరీర్‌కు బ్రేక్ ఇవ్వడానికి సిద్ధమైన నటి

తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా ఆప్టే.. పని గంటల విషయంలో తాను కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘వారం రోజులపాటు నా బిడ్డను చూడకుండా ఉండడం నాకు అస్సలు సాధ్యం కావడం లేదు. అందుకే నా పని వేళల విషయంలో హద్దులు పెట్టుకున్నాను’ అని అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘షూటింగ్ గంటలను మార్చాల్సిన అవసరం చాలా ఉందని నటి రాధికా ఆప్టే స్పష్టం చేసింది. వారం రోజుల పాటు తన బిడ్డను చూడకుండా ఉండాలని ఆశించడం అన్యాయమని, అందుకే సుదీర్ఘమైన షిఫ్టులకు తాను ఒప్పుకోనని చెప్పింది. ఈ నిర్ణయం కోసం ఎన్నో వాదనలు, గొడవలు కూడా ఎదురయ్యాయని తెలిపింది.

కొత్త రూల్స్‌తో రాధికా ఆప్టే.. నిర్మాతలకి షాక్!

అమ్మమ్మ లేదా నాన్నమ్మ‌ను సెట్‌కు తీసుకురావడం పరిష్కారం కాదని, మాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం తనకు ముఖ్యమని వెల్లడించింది.ఇకపై సినిమాలు సైన్ చేసేటప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టాలని రాధికా నిర్ణయించకున్నట్లు పేర్కొంది. రోజుకు గరిష్టంగా 12 గంటల షిఫ్ట్ మాత్రమే, అందులో ప్రయాణం, మేకప్, హెయిర్, షూటింగ్ అన్నీ కలిపే ఉండాలని చెప్పింది. ప్రయాణానికి రెండు గంటలు పడితే దానిని కూడా పని గంటలుగా పరిగణించాలని, వీలైనంత వరకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలని, తప్పనిసరిగా వారపు సెలవు ఉండాలని స్పష్టం చేసింది. చిన్న సినిమాల విషయంలో మాత్రమే కొన్ని మినహాయింపులు ఇస్తానని తెలిపింది.

రాధికా ఆప్టే తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.