|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్నారై యువతికి చేదు అనుభవం! టాలీవుడ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు! దిగ్గజ తారలు కరువయ్యారంటూ..!

Published: 03-04-2026, 11:35 AM
ఎన్నారై యువతికి చేదు అనుభవం! టాలీవుడ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు! దిగ్గజ తారలు కరువయ్యారంటూ..!
  • ఎన్నారై యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై పూనమ్ కౌర్ స్పందన.
  • తెలుగు ఇండస్ట్రీలో సావిత్రి, సౌందర్య వంటి తారలు లేకపోవడానికి కారణం పరిస్థితులేనన్న పూనమ్.
  • క్యాస్టింగ్ కౌచ్ కారణంగానే ప్రతిభ గల నటీనటులకు గుర్తింపు రావట్లేదన్న పూనమ్.
  • పికు నెమలి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నిర్మాతపై చేసిన ఆరోపణలకు మద్దతు తెలిపిన పూనమ్.

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో ఉంటున్న ఒక ఎన్నారై యువతి తెలుగు నిర్మాత తనను లైంగికంగా వేధించాడని ఆరోపించగా, దీనిపై పూనమ్ స్పందిస్తూ ఇండస్ట్రీలోని పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నారై యువతి ఆరోపణలు – పూనమ్ కౌర్ రియాక్షన్

Poonam Kaur: పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత విషయాలు అలాగే సోషల్ మీడియాలో చేసే పోస్టులు కారణంగానే పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూనమ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా వివాదం చెలరేగితే కచ్చితంగా ఈమె స్పందిస్తూ ఆ వివాదం పట్ల తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు పట్ల పూనమ్ స్పందిస్తూ పూర్తి మద్దతును తెలుపుతుంటారు.

ఈ నేపథ్యంలోనే న్యూయార్క్‌లో ఉంటున్న ‘పికు నెమలి’ (Piku Nemali) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక నిర్మాత తనని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బందులు పెట్టారంటూ ఈమె ఆరోపణలు చేసి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియో పై టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నటీమణులు స్పందిస్తూ పూర్తిస్థాయిలో వారి మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికే యాంకర్ ఝాన్సీ ఈ వీడియో పై స్పందిస్తూ ఆమెకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఇకపోతే తాజాగా నటి పూనమ్ కౌర్(Poonam Kaur) సైతం ఈ వీడియో పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి, జయప్రద, భానుప్రియ, శ్రీదేవి, సౌందర్య వంటి నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరు అని చెప్పడానికి కారణం లేకపోలేదు. నేను కొంతమందిని కలిసి వ్యక్తిగతంగా వారితో మాట్లాడానని తెలిపారు. ఎంతో అందం, మంచి నైపుణ్యత కలిగిన తెలుగు వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు అయితే వారికి సరైన గుర్తింపు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులేనని, ఈ విషయాన్ని తాను చాలా గాఢంగా నమ్ముతున్నాను అంటూ పూనమ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

టాలీవుడ్‌లో హీరోయిన్ల పరిస్థితిపై పూనమ్ ఆవేదన

Reason why there are no more savitri’s , jayaprada garu , bhanupriya garu , Sridevi garu , Soundarya garu in TFI.

There are certainly very very beautiful looking and well qualified , Telugu artists who I have personally met – I do feel the same deeply. #truth https://t.co/pgEU4iouBY

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 3, 2026

క్యాస్టింగ్ కౌచ్‌పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని దాని కారణంగానే మంచి నటీనటులు ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సందర్భంగా ఈమె చెప్పకనే చెప్పేశారు. అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఈ అంశం గురించి మాట్లాడుతూ తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులమేనని తమ గోడును మొత్తం బయటపెట్టారు. అయితే ఎవరూ కూడా వారిని ఇబ్బందులకు గురి చేసిన దర్శక, నిర్మాతల పేర్లు మాత్రం బయట పెట్టకపోవడం గమనార్హం. ఇక పూనం కౌర్ సైతం ఇండస్ట్రీలో పలువురు దర్శకులను టార్గెట్ చేస్తూ వారు తనని ఇబ్బందులకు గురి చేశారని తరచు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో మహిళల భద్రత, ప్రతిభకు గుర్తింపు లేకపోవడం వంటి అంశాలపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచించదగినవి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.