
📌 Key Points
- థియేటర్ల కంటే ఓటీటీ సినిమాలకే పెరుగుతున్న ఆదరణ, ఆసక్తి చూపుతున్న హీరోలు.
- ఓటీటీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు వెంట వెంటనే రావడంతో ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం.
- అమెజాన్ ప్రైమ్‌లో రవితేజ వెబ్ సిరీస్ చేసే అవకాశం, త్వరలో ప్రకటన.
- నాగ చైతన్య కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లపై దృష్టి సారిస్తున్నారు. రవితేజ అమెజాన్ ప్రైమ్‌తో వెబ్ సిరీస్ చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. నాగ చైతన్య కూడా ఓటీటీలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఓటీటీకి పెరుగుతున్న ఆదరణ
Tollywood: ఇటీవల కాలంలో థియేటర్లలో వచ్చే సినిమాలు కన్నా ఓటీటీలో వచ్చే సినిమాలకు డిమాండ్ రోజుకి పెరుగుతుంది. అందుకే ఈమధ్య సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం ఓటీటీలో సినిమాలు వెబ్ సిరీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈ సినిమాలైతే ఏడాదికి ఒకటే ఉంటాయి కానీ వెబ్ సిరీస్ లు లేదా ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యే సినిమాలు వెంట వెంటనే రావడంతో ప్రేక్షకులకు దగ్గర వచ్చు అనే ఉద్దేశంతో చాలామంది స్టార్స్ ఓటీటీ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది స్టార్స్ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా ఓటీటీలోకి వచ్చేసినట్లు తెలుస్తుంది.. మరి ఆ స్టార్ హీరోలు ఎవరు? ఎక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూసేద్దాం..
ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తే చాలని చాలామంది స్టార్ హీరోలు అనుకునే వాళ్ళు.. కానీ ఈ మధ్య స్టార్ హీరోలు జనాలకి దగ్గరగా వెళితేనే.. మనకు హిట్ సినిమాలు పడతాయని అభిప్రాయానికి వచ్చేసారు.. అందుకే జనాలని ఎక్కువగా అలరిస్తున్న డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు మరి కొంతమంది ఓటీటీలోకి రాబోతున్నారు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన మాస్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో డిఫరెంట్ స్టోరీలతో వచ్చిన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. అయితే ఈ మధ్య ఈ హీరోకి పెద్దగా టైం కలిసి రావడం లేదన్న విషయం తెలిసిందే.. ఈయన నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. రీసెంట్ గా రిలీజ్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో రవితేజ వెబ్ సిరీస్లలో నటించేందుకు ఆసక్తి కనపరుస్తున్నట్లు ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఓ వెబ్ సిరీస్ చెయ్యనున్నాడని టాక్.. త్వరలోనే దీని గురించి ప్రకటించే అవకాశం ఉంది..
ఓటీటీలో రవితేజ సరికొత్త ప్రయత్నం
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవల తండేల్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం ఓ రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ హీరో కూడా ఓటీటీలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు.. దూత నెక్స్ట్ సీజన్ రాబోతున్నట్లు సమాచారం..
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. ప్రస్తుతం డెకాయిట్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.. ఈయన నెట్ ఫ్లిక్స్ లోని భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు..
నాగ చైతన్య ఓటీటీ ఎంట్రీ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన కూడా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు సమాచారం..
ఇప్పటివరకు అయితే ఈ హీరోలు మాత్రమే ఓటీటీలోకి రాబోతున్నారు.. ఇకముందు ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.
మొత్తానికి టాలీవుడ్ హీరోలు ఓటీటీ బాట పట్టడం ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని విశేషాలు వెలుగులోకి రానున్నాయి.

