|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Radhika Apte: ‘మూడు నెలల గర్భంతో ఉన్నా.. ఆ నిర్మాతకు కొంచెం కూడా దయలేదు’

Published: 07-08-2025, 9:16 AM
Radhika Apte: 'మూడు నెలల గర్భంతో ఉన్నా.. ఆ నిర్మాతకు కొంచెం కూడా దయలేదు'

ప్రముఖ నటి రాధికా ఆప్టే తన మూడు నెలల గర్భధారణ సమయంలో సినిమా నిర్మాత వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శారీరకంగా, మానసికంగా కష్టకాలంలో సహకారం లేకపోవడంపై ఆమె బాధను పంచుకుంది.

Key Points

1

గర్భధారణ సమయంలో సినిమా నిర్మాత వైఖరితో రాధికా ఆప్టే బాధపడింది.

2

మూడు నెలల గర్భంతో ఉన్నా, బిగుతు దుస్తులు ధరించమని నిర్మాత ఒత్తిడి చేశాడు.

4

వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, గర్భిణులకు సానుభూతి అవసరమని రాధికా అభిప్రాయపడింది.

గర్భధారణ సమయంలో రాధికా ఆప్టే అనుభవాలు

టాలీవుడ్ ‌ లెజెండ్ , లయన్ చిత్రాల్లో మెప్పించిన నటి రాధికా ఆప్టే . తెలుగులో రక్త చరిత్ర మూవీతో ఎంట్రీ ఇచ్చింది . అంతకుముందే బాలీవుడ్ ‌ సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ ‌ చిత్రాల్లో కనిపించింది . బాలీవుడ్ ‌ తో పాటు తమిళం , మరాఠీ , బెంగాలీ సినిమాల్లో మెప్పించింది . చివరిసారిగా సిస్టర్ మిడ్ ‌ నైట్ చిత్రంలో కనిపించింది .

అయితే రాధికా ఆప్టే లండన్ ‌ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ ‌ ను 2012 లో రిజిస్టర్ ‌ మ్యారేజ్ చేసుకుంది . సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే రాధికా .. పెళ్లయిన పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించింది . గతేడాది డిసెంబర్ ‌ లో బిడ్డకు జన్మనిచ్చింది . తాజాగా నేహా ధూపియా నిర్వహిస్తోన్న ఫ్రీడమ్ టు ఫీడ్ లైవ్ సెషన్ ‌ కు హాజరైన ముద్దుగుమ్మ .. తాను గర్భం ధరించాక ఎదురైన అనుభవాలను పంచుకుంది .

సినిమా నిర్మాత ప్రవర్తనపై విమర్శలు

మొదటి ట్రైమిస్టర్ ‌ లో సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సంఘటనలను పంచుకుంది . గర్భంతో ఉన్నప్పటికీ సెట్ ‌ లో ఎలాంటి సానుభూతి చూపలేదని బాధను వ్యక్తం చేసింది . మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్‌ వచ్చాయని తెలిపింది. ఆ సమయంలో ఓ నిర్మాత తనతో వ్యవహరించిన తీరుతో చాలా ఇబ్బంది పడ్డానని వివరించింది .

వృత్తిపరమైన బాధ్యతలు మరియు గర్భధారణ

రాధికా ఆప్టే మాట్లాడుతూ ..’ ఆ నిర్మాతకు నేను గర్భం ధరించడం ఇష్టం లేదనుకుంటా . నాకు చాలా అసౌకర్యం , ఇబ్బందిగా ఉందని చెప్పినా బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలని పట్టుబట్టాడు. నా మొదటి త్రైమాసికంలో నేను కాస్తా ఎక్కువగానే తింటున్నా . అప్పుడు నా శరీరంలో విపరీతమైన మార్పులొచ్చాయి . కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోకపోవడంతో అసహనానికి గురయ్యా. అదే షూటింగ్ సెట్‌లో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉన్నప్పుడు వైద్యుడిని కలిసేందుకు కూడా నన్ను అనుమతించలేదు. అది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. వృత్తిపరంగా నిబద్ధతగానే ఉండాలని తెలుసు . ఆ విషయాన్ని ఎల్లప్పుడు గౌరవిస్తా . కానీ ఇలాంటి టైమ్ ‌ లో కొంచెం సానుభూతి కూడా అవసరం ‘ అని తన బాధను పంచుకుంది .

గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను రాధికా ఆప్టే అనుభవం హైలైట్ చేస్తుంది. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, మానవీయత కూడా అవసరమని ఈ ఘటన చాటుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.