
న్యూమరాలజీ ప్రకారం, పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నంబర్ నిర్ణయించవచ్చు. ఈ వ్యాసంలో రాడిక్స్ నంబర్ 4 గురించి, ముఖ్యంగా 4, 13, 22 తేదీల్లో పుట్టిన వారి కుటుంబ ప్రేమ గురించి తెలుసుకుందాం.
Key Points
4, 13, 22 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నంబర్ 4 కి చెందినవారు.
వీరు కుటుంబం పట్ల అమితమైన అనురాగాన్ని కలిగి ఉంటారు.
నిజాయితీ, నమ్మకం వీరి ప్రధాన లక్షణాలు.
ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది.
రాడిక్స్ నంబర్ 4 లక్షణాలు
రాశుల ఆధారంగా ఎలా అయితే ఒక మనిషి తీరు, ప్రవర్తన, భవిష్యత్తు చెప్తాము, న్యూమరాలజీ ఆధారంగా కూడా ఒక మనిషి పేరు, ప్రవర్తన, భవిష్యత్తును చెప్పవచ్చు. న్యూమరాలజీ లో ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్‌ని కనుగొనవచ్చు. జ్యోతిష్యం లాగే న్యూమరాలజీ కూడా జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది.
పుట్టిన తేదీ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు రాడిక్స్ నెంబర్ నాలుగు కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రాడిక్స్ నెంబర్ నాలుగుకి చెందిన వ్యక్తుల్లో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా నెలలో 4, 13, 22 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. పైగా బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కసారి ఏ తేదీల్లో పుట్టిన వారు ఎవరితోనైనా కనెక్ట్ అయితే, చివరి వరకు వారితోనే ఉండాలని అనుకుంటారు.
కుటుంబ బంధాలపై ప్రభావం
రాడిక్స్ నెంబర్ 4 వారు ఎలా ఉంటారు?
రాడిక్స్ నెంబర్ 4 వారు కొంచెం ఇతరులకు దూరంగా ఉంటారు. ఇంట్రావర్ట్స్ అని చెప్పొచ్చు. అంత ఈజీగా వారి భావాలను బయటకు చెప్పరు. ఈ తేదీల్లో పుట్టిన వారు నిజాయితీగా ఉంటారు. అప్పుడప్పుడు కాస్త మొండిగా కూడా ఉంటారు.
పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారు కుటుంబ సభ్యులతో ఎంతో ఎక్కువ మమకారంతో ఉంటారు. వీళ్లు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు పెద్దగా రొమాంటిక్ కాదు. కానీ జీవిత భాగస్వామికి గౌరవం ఇస్తారు. నమ్మకంగా ఉంటారు.
ఇతర రాడిక్స్ నంబర్లతో సంబంధాలు
రాడిక్స్ నెంబర్ 1 వారితో చాలా అనుకూలంగా ఉంటారు. ఎక్కువ విభేదాలు రావు. రాడిక్స్ నెంబర్ 2 వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. రాడిక్స్ నెంబర్ 3 వారితో ఎక్కువగా కలిసి పోతారు. మంచి స్నేహితులుగా ఉంటారు. రాడిక్స్ నెంబర్ 4 వారితో కూడా బాగా కలిసి పోతారు కానీ ఎక్కువ గొడవలు రావచ్చు. రాడిక్స్ నెంబర్ 5 వారితో కూడా మంచి బంధాన్ని కొనసాగిస్తారు.
రాడిక్స్ నెంబర్ 6 వారితో స్నేహం, పెళ్లి కుదురుతుంది. మంచి స్నేహితులుగా కూడా ఉండొచ్చు. రాడిక్స్ నెంబర్ 7 వారితో కలిసి మంచి వ్యాపారాలు చేస్తారు. వీరి సంబంధం కూడా మధురంగా ఉంటుంది. రాడిక్స్ నెంబర్ 8 వారితో కూడా బాగా కలిసిపోతారు. కానీ అప్పుడప్పుడు గొడవలు జరిగే అవకాశం ఉంది. రాడిక్స్ నెంబర్ 9 వారితో కూడా వీరు బాగా కలిసి పోతారు. స్నేహం, పెళ్లి, వ్యాపారంలో పార్ట్నర్‌షిప్‌కి కూడా అనుకూలంగా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
రాడిక్స్ నంబర్ 4 వారు కుటుంబ ప్రేమికులు. వారి నిజాయితీ, నమ్మకం వారిని ప్రత్యేకంగా చేస్తాయి. ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించడంలో వారు చక్కగా సమన్వయం చేసుకుంటారు.


