|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT: రిలీజ్‌కు ముందే క్రేజ్ క్రియేట్ చేస్తున్న రాఘవా లారెన్స్ ‘BENZ’ మూవీ..

Updated: 26-05-2025, 10:04 AM
OTT: రిలీజ్‌కు ముందే క్రేజ్ క్రియేట్ చేస్తున్న రాఘవా లారెన్స్ 'BENZ' మూవీ..

మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ నటించిన తాజా చిత్రం ‘BENZ’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి.

Key Points

1

రాఘవ లారెన్స్ నటించిన 'BENZ' సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

2

నెట్‌ఫ్లిక్స్ 'BENZ' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది.

4

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగాయి.

‘BENZ’ సినిమా షూటింగ్ ప్రారంభం

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతా.. ఇలా మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence). భాషతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోతో హైప్ పెంచేశాడు. అంతే కాకుండా.. ‘ఒక కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు’ అనే క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన ఈ ఫస్ట్ లుక్ వీడియో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు కొనుగోలు

దీంతో ఈ సినిమాను నుంచి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులతో పాటు.. రాఘవ లారెన్స్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుపగా.. తాజాగా ఓటీటీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ సినిమాపై మరన్ని ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ప్రేక్షకుల అంచనాలు పెరుగుతున్నాయి

#Benz Digital streaming rights bagged by Netflix 🍿 !! #LCU #OTT_Trackers pic.twitter.com/3U9ajCxjGs

మొత్తంమీద, ‘BENZ’ సినిమాపై ఉన్న అంచనాలు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కుల కొనుగోలుతో మరింత పెరిగాయి. రాఘవ లారెన్స్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.