|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

Published: 15-05-2025, 5:20 AM
గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ప్రముఖ నటుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తన మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా రైతులకు 10 ట్రాక్టర్లను అందించారు. ఈ కార్యానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. రైతులు తమ పంటలను రాఘవకు బహుకరించారు.

Key Points

1

రాఘవ లారెన్స్ రైతులకు 10 ట్రాక్టర్లు బహుమతిగా ఇచ్చారు.

2

రైతులు తమ పంటలను రాఘవ లారెన్స్ కు బహుకరించారు.

4

నెటిజన్లు రాఘవ లారెన్స్ గొప్ప మనసును ప్రశంసించారు.

రాఘవ లారెన్స్ రైతులకు చేసిన సహాయం

డాన్స్ మాస్టర్, స్టార్ నటుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) అందరికీ సుపరిచితమే. ‘స్లైల్’ సినిమాతో హీరోగా మారిన ఆయన ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించాడు. మరీ ముఖ్యంగా ‘కాంచన’(Kanchana) చిత్రంలో నటించి ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌ల ద్వారా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. తనవంతు సాయంగా ప్రజలకు కొంత డబ్బులు అందిస్తూ వారి కష్టంలో అండగా ఉంటున్నారు. తాజాగా, రాఘవ లారెన్స్ తన సొంత డబ్బుతో రైతులకు పది ట్రాక్టర్లను కొనిచ్చాడు.

ఇక వాటిని తీసుకున్న రైతులు పంటలు పండించిన ఊరి జనం ఆయనను కలిసి పండ్లు, కూరగాయలు, పల్లి కాయలు ఆయనకు ఇచ్చారు. ఇక ఈ వీడియోను రాఘవ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘‘హాయ్ ఫ్రెండ్స్ అభిమానులారా, నా సొంత డబ్బుతో మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా రైతులకు 10 ట్రాక్టర్లను అందజేసినట్లు మీ అందరికీ తెలుసు. రైతులు నాకు ఫోన్ చేసి ట్రాక్టర్లను ఉపయోగించి పండించిన ధాన్యాలు, కూరగాయలన్నింటినీ తీసుకొస్తామని కోరుకున్నారు. వారి చేతుల నుండి వాటిని అందుకోవడానికి నా హృదయం సంతోషంతో నిండి పోయింది. భవిష్యత్తులో రైతులకు మరిన్ని విరాళాలు అందించాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం రాఘవ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా మీరు చాలా గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

రైతుల నుండి రాఘవ లారెన్స్ కు బహుమతి

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

రాఘవ లారెన్స్ చేసిన ఈ కార్యం అందరినీ ఆకట్టుకుంది. రైతులకు అండగా నిలిచిన ఆయన గొప్ప మనస్సుకు ప్రజలు, నెటిజన్లు ప్రశంసలు తెలుపుతున్నారు. ఇటువంటి మంచి పనులు ఎల్లప్పుడూ ప్రోత్సహించబడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.