|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Raghava Lawrence: సహాయంలో నీకు సాటి ఎవరూ లేరు.. స్టార్ హీరోపై నెట్టింట ప్రశంసల వర్షం

Published: 08-05-2025, 10:47 AM
Raghava Lawrence: సహాయంలో నీకు సాటి ఎవరూ లేరు.. స్టార్ హీరోపై నెట్టింట ప్రశంసల వర్షం

ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన మంచి గుణాలతో మరోసారి అందరి మనసులను గెలుచుకున్నారు. శివగంగై జిల్లాలోని ఒక నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, వారి కష్టాలను తగ్గించారు.

Key Points

1

రాఘవ లారెన్స్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.

2

శివగంగై జిల్లా కుటుంబం దాచుకున్న డబ్బు చెదలు కుట్టాయి.

4

నెటిజన్లు లారెన్స్‌ను 'దేవుడు' అంటూ ప్రశంసిస్తున్నారు.

నిరుపేద కుటుంబానికి రాఘవ లారెన్స్ సహాయం

డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్‌గానే కాకుండా.. సమాజంలో ఓ మంచి వ్యక్తిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence). ఇప్పటికే ఎంతో మందికి తనకు చేతనైనా సహాయం అందించి అనాధ పిల్లల్లో, ఎంతో మంది అభాగ్యుల్లో దేవుడుగా నిలిచి ఈయన.. ఇప్పుడు మరో గొప్ప పని చేసి నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని క్లాధారి గ్రామానికి చెందిన ముత్తు కరుప్పు అనే నిరుపేద ఫ్యామిలీ కూలిపనుల ద్వారా వచ్చిన రూ. 1 లక్షను దాచిపెట్టుకోగా ఆ డబ్బు మొత్తాన్ని చెదలు కుట్టేశాయి. అయితే.. వీరికి సహాయం అందించాలని ఓ వ్యక్తి రాఘవ లారెన్స్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టగా.. వెంటనే దానిపై రియాక్ట్ అయినా ఈ రియల్ హీరో ఆ కుటుంబం సమాచారం అందించాలని కోరారు.

చెదలు కుట్టిన డబ్బు

ఇక ఈరోజు ఆ ఫ్యామిలీకి సహాయం కూడా చేసి దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ‘అందరికీ హాయ్.. ఒక కూలీ కుటుంబం చాలా సంవత్సరాలుగా దాచుకున్న డబ్బులో లక్ష రూపాయలు చెదపురుగుల వల్ల పోయాయని నాకు వార్త వచ్చింది. వాళ్ల పరిస్థితి తలుచుకుని నా గుండె తరుక్కుపోయింది. కాబట్టి, పోగొట్టుకున్న డబ్బును వారి కోసం విరాళంగా ఇవ్వడానికి నేను సంతోషంగా ఉన్నాను. ఈ వార్త నాకు చేరవేయడంలో పాలుపంచుకున్న మీడియాకు, వ్యక్తులకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘నువ్వు దేవుడువి అన్నా.. సహాయం చేయడంలో నీకు సాటి ఎవరూ లేరు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

నెట్టింట ప్రశంసల వర్షం

Hi Everyone, I came across the news that a coolie family lost 1lakh of their many years of savings due to termites. My heart sank thinking about what they must’ve gone through. So, I’m happy to contribute the lost money for them. Thanks to the media and people involved in… pic.twitter.com/Rmhv3VNBNV

రాఘవ లారెన్స్ మంచి మనసుతో చేసిన ఈ కార్యం అందరినీ ఆకట్టుకుంది. సమాజ సేవకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఆయనకు ప్రజల నుండి అపారమైన ప్రశంసలు లభిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.