|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Raghava Lawrence: ‘అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా’

Published: 11-09-2025, 6:16 AM
Raghava Lawrence: 'అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా'

కోలీవుడ్ నటుడు రాఘవ లారెన్స్ తన సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటున్నారు. తాజాగా, చెన్నై రైలులో స్వీట్లు అమ్ముకుంటున్న ఓ వృద్ధ దంపతులకు లక్ష రూపాయలు సాయం చేయాలని ఆయన ప్రకటించారు.

Key Points

1

రాఘవ లారెన్స్ వృద్ధ దంపతులకు లక్ష రూపాయలు సాయం చేయాలని నిర్ణయించారు.

2

చెన్నై రైలులో స్వీట్లు అమ్ముకుంటున్న 80 ఏళ్ల వృద్ధుడి కథ లారెన్స్‌ను కదిలించింది.

4

లారెన్స్ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

వృద్ధ దంపతులకు రాఘవ లారెన్స్ సహాయం

కోలీవుడ్ స్టార్‌ హీరో రాఘవ లారెన్స్‌ సినిమాలు మాత్రమే కాదు .. సమాజ సేవలో దూసుకెళ్తున్నారు . ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తనకు తెలిసిన మరుక్షణమే వెళ్లి దేవుడిలా సాయం చేస్తున్నారు . ఇప్పటికే చాలామంది పేద రైతులకు , విద్యార్థులకు తనవంతుగా ఆర్థికంగా అండగా నిలిచారు . ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు.

రైలులో స్వీట్లు అమ్ముతున్న వృద్ధులు

ఇది జరిగిన మూడు రోజుల్లోనే మరో వృద్ధ దంపతులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు . చెన్నైలో లోకల్ ‌ ట్రైన్స్ ‌ లో స్వీట్స్ దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్వీట్లు విక్రయించడం సోషల్ మీడియాలో వైరలైంది . ఆ వయసులో తన భార్య చేసిన స్వీట్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు . పలు మీడియా ఛానెల్స్ ‌ లో ఈ న్యూస్ రావడంతో ఇది చూసిన రాఘవ లారెన్స్ చలించిపోయారు .

లారెన్స్ విజ్ఞప్తి

వెంటనే వారి వివరాలు కనుక్కుని రూ . లక్ష సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు . ఎవరికైనా వారి వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలని ట్విటర్ వేదికగా కోరారు . వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదన్నారు . మీరు వారిని రైలులో చూసినట్లు అయితే అతని స్వీట్లు కొని వీలైన విధంగా వారికి మద్దతు నిలవండి అని లారెన్స్ విజ్ఞప్తి చేశారు . కాగా .. లారెన్స్‌ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్‌ చేయనున్నాడు.

రాఘవ లారెన్స్ మంచి మనసుతో వృద్ధులకు సాయం చేయాలని ముందుకొచ్చారు. వారి వివరాలు తెలియజేయాలని ప్రజలను కోరుతూ ఆయన సహాయ హస్తం అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.