|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డ్రగ్స్ టెస్టులకు హీరోలు రెడీ… మరి లై డిటెక్టర్ టెస్టులకు రాజకీయ నాయకులు సిద్ధమా? సంచలన సవాల్!

Published: 01-04-2026, 4:05 AM
డ్రగ్స్ టెస్టులకు హీరోలు రెడీ... మరి లై డిటెక్టర్ టెస్టులకు రాజకీయ నాయకులు సిద్ధమా? సంచలన సవాల్!
  • డ్రగ్స్ నియంత్రణ కోసం హీరోలు 90 రోజులకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచన.
  • రాహుల్ రామకృష్ణ కౌంటర్: మేము డ్రగ్స్ టెస్టులకు సిద్ధం, మీరు లై డిటెక్టర్ టెస్టులకు రెడీనా?
  • ప్రతి ఆదివారం రాజకీయ నాయకులకు లై డిటెక్టర్ టెస్టులు పెట్టాలని రాహుల్ సవాల్.
  • నటులు డ్రగ్స్ తీసుకుంటున్నారో లేదో మెడికల్ టెస్టులు చెబుతాయని రాహుల్ వ్యాఖ్య.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. హీరోలు డ్రగ్స్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించగా, రాజకీయ నాయకులు లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా అని రాహుల్ ప్రశ్నించారు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Rahul Ramakrishna: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. డ్రగ్స్ నియంత్రణ కోసం సినిమా హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలని ఆయన చేసిన సూచనకు, విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “మేము డ్రగ్స్ టెస్టులకు రెడీ.. మరి మీరు లై డిటెక్టర్ టెస్టులకు రెడీనా?” అంటూ రాహుల్ విసిరిన సవాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ నాయకులు, సినీ నటుల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో సినిమా ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య అనగానే అందరికీ సినిమా ఇండస్ట్రీనే గుర్తుకొస్తోందని, అందుకే హీరోలు తమ అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ప్రతి మూడు నెలలకొకసారి హీరోలు స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకుని ఆ రిపోర్టులను బయటపెట్టాలని, లేదంటే వారు డ్రగ్స్ వాడుతున్నట్లేనని జనాలు భావిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఇక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై నటుడు రాహుల్ రామకృష్ణ ‘X’ (ట్విట్టర్) వేదికగా గట్టిగానే స్పందించారు. “నేను పెద్ద హీరోని కాకపోయినా డ్రగ్స్ టెస్టుకు సిద్ధం. ప్రభుత్వం వెంటనే దీనిపై జీవో జారీ చేయాలి” అంటూనే అసలైన ట్విస్ట్ ఇచ్చారు. “మేము డ్రగ్స్ టెస్టులు చేయించుకుంటాం.. కానీ ప్రతి ఆదివారం రాజకీయ నాయకులకు ‘లై డిటెక్టర్’ టెస్టులు పెట్టాలి. అప్పుడే ప్రజలకు అసలు నిజాలు తెలుస్తాయి” అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం కాస్తా ‘మీరు సిద్ధమా.. మేము సిద్ధమా’ అనే స్థాయికి చేరింది.

రాహుల్ రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్

ఇక రాహుల్ రామకృష్ణ తన పోస్ట్‌లో మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టెస్టుల కార్యక్రమం ఏదో మూడు నెలలకొకసారి కాకుండా, ప్రతి వారం నిర్వహిద్దామని సవాల్ విసిరారు. నాయకులు అబద్ధాలు ఆడుతున్నారో లేదో లై డిటెక్టర్ చెబితే, నటులు డ్రగ్స్ తీసుకుంటున్నారో లేదో మెడికల్ టెస్టులు చెబుతాయని, అప్పుడు మాత్రమే ప్రజలు ఎవరిని నమ్మాలో నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. ఇక అప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి చెందుతుందని రాహుల్ రాసుకొచ్చారు. ఈ లాజిక్ చూసి నెటిజన్లు కూడా రాహుల్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

రాహుల్ రామకృష్ణ విషయానికి వస్తే.. ఈయన తన సినిమాల కంటే కూడా ఇలా సమాజంలో జరిగే పలు అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాహుల్ రామకృష్ణ నటుడు, రచయిత , విలేకరి కూడా.. సైన్మా అనే షార్ట్ ఫిలిమ్ తో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన.. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో స్నేహితుడు పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇక నేషనల్ అవార్డు అందుకున్న పెళ్లి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశారు. ముఖ్యంగా సమ్మోహనం, భరత్ అనే నేను, ఇంటలిజెంట్, జయమ్ము నిశ్చయమ్మురా, హుషారు, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురంలో, విరాటపర్వం, అంటే సుందరానికి , ఇంటింటి రామాయణం, ఓం భీమ్ బుష్, ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా పలు చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.

లై డిటెక్టర్ టెస్టులపై దుమారం

హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ! అర్జెంటు గా G.O జారీ చేస్తే అందరం కలిసి చెయ్యిచ్చుకుందాం- మేము డ్రగ్ టెస్టులు మీరు lie డిటెక్టర్ టెస్ట్. ప్రతీ ఆదివారం పెట్టుకుందాం ఈ గొప్ప కార్యక్రమం,అప్పుడే మీ మాట,మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. Minoxidil drug ఎందుకు గుర్తొస్తోందో🤔 https://t.co/T5v3PnDZHE

— Rahul Ramakrishna (@eyrahul) March 31, 2026

రాహుల్ రామకృష్ణ సవాల్ రాజకీయ నాయకులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. నిజనిర్ధారణ పరీక్షలతో సమాజంలో మార్పు వస్తుందా అనేది ప్రశ్నార్థకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.