
📌 Key Points
- రాజ్ బి శెట్టి: ఆరేళ్ల పాటు ప్రేమించిన అమ్మాయి హ్యాండిచ్చింది, కారణం చెప్పనుకున్నానని ముందే చెప్పా.
- ‘బ్రేకప్ తర్వాత నేను ఎదిగాను, లేకపోతే చెడ్డవాడిగానే ఉండిపోయేవాడిని’ అని రాజ్ బి శెట్టి సంచలన వ్యాఖ్యలు.
- సు ఫ్రం సో సినిమాతో రాజ్‌కు ఇండియా వైడ్‌గా గుర్తింపు; కేవలం ఆరు కోట్లతో తీస్తే రూ.125 కోట్లు వసూలు.
- ప్రస్తుతం తన జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉందని, ఇద్దరం సంతోషంగా ఉన్నామని రాజ్ బి శెట్టి వెల్లడి.
రాజ్ బి శెట్టి తన జీవితంలోని ప్రేమ కథ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఆరేళ్ల పాటు సాగిన ప్రేమ, ఆ తరువాత బ్రేకప్ వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం! ఈ షాకింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆరేళ్ల ప్రేమ కథకు షాకింగ్ ముగింపు!
సు ఫ్రం సో మూవీతో ఒక్కసారిగా ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యాడు దర్శకుడు, నటుడు రాజ్ బి శెట్టి. ఇందులో ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. అదే సమయంలో తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి ఎలా హిట్టు కొట్టొచ్చో నిరూపించారు. ఆయన ‘ఒండు మొట్టెయ కథె’ అయినా, ‘సు ఫ్రం సో’ అయినా బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ముఖ్యంగా ‘సు ఫ్రం సో’ ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇది ఆరు కోట్లతో తీస్తే ఏకంగా రూ.125కోట్లు రాబట్టింది.
కన్నడలో క్రేజీ స్టార్‌గా మారిన రాజ్ బి శెట్టి తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు. ఇప్పుడు ఆయన తొలిసారిగా తన లవ్ లైఫ్ గురించి ఓ పెద్ద సీక్రెట్ బయటపెట్టారు. తన ప్రేమ వైఫల్యం, దాని నుంచి నేర్చుకున్న పాఠాలు, జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పలు రహస్యాలను వెల్లడించారు.
రాజ్ బి శెట్టి జీవితాన్ని మార్చిన బ్రేకప్!
‘భర్జరి బ్యాచిలర్స్’ షోలో రాజ్ ఈ విషయాలు చెప్పారు. ఈ వీడియోను namma_kannada_tv ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆయన చెబుతూ, `ఒకమ్మాయి నాతో ఆరేళ్లు ఉంది. ఆ బంధం మొదలయ్యేటప్పుడే నేను చెప్పాను. నువ్వు వెళ్లిపోతానంటే కారణం అడగనని. సరిగ్గా అలాగే జరిగింది. ఆరేళ్ల తర్వాత ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది’ అని రాజ్ చెప్పారు.
‘ఒకవేళ ఆమె నన్ను అప్పుడు వదిలి వెళ్లకపోయుంటే, నేను చెడ్డవాడిగానే మిగిలిపోయేవాడిని అనిపిస్తోంది. నేనేమీ మంచివాడినని కాదు. కానీ బ్రేకప్ అయ్యాక నాకు తెలిసొచ్చింది. నేను ఆమెకు సరిగ్గా ప్రేమను పంచలేదని అర్థమైంది’ అని రాజ్ బి శెట్టి చెప్పారు.
ప్రస్తుత జీవిత భాగస్వామి గురించి రాజ్ కామెంట్స్!
ఆయన ఇంకా చెబుతూ, ‘కానీ ఆమె బ్రేకప్ చెప్పడం వల్లే నేను ఎదిగాను. లేదంటే చెడ్డవాడిగానే ఉండిపోయేవాడిని. నువ్వు నాతో ఉండటానికి అర్హుడివి కాదు అనే విషయాన్ని ఆమె నాకు నేర్పింది’ అని రాజ్ చెప్పారు.
‘ఆ తర్వాత మరో అమ్మాయితో బంధం కూడా త్వరగానే ముగిసింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఒకరున్నారు’ అంటూ తన భార్య గురించి రాజ్ మాట్లాడారు. ‘ప్రస్తుతం నాతో ఉన్న ఆమెకు జీవితంలో చాలా అన్వేషణ ఉంది. నాకూ అలానే ఉంది. మేమిద్దరం సంతోషంగా ఉన్నాం’ అని రాజ్ తెలిపారు. ఆయన చెప్పిన ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.
రాజ్ బి శెట్టి తన ప్రేమ జీవితం గురించి చెప్పిన ఈ విషయాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.


