|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా భర్త పేరుతో నన్ను పిలుస్తారు.. నటిగా నాకు పేరు, గుర్తింపు ఉంది.. స్టార్ నటుడు భార్య ఎమోషనల్ కామెంట్స్

Published: 10-05-2025, 3:12 PM
నా భర్త పేరుతో నన్ను పిలుస్తారు.. నటిగా నాకు పేరు, గుర్తింపు ఉంది.. స్టార్ నటుడు భార్య ఎమోషనల్ కామెంట్స్

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనను కేవలం ఆయన భార్యగా పిలవడాన్ని ఆమె ఎంతగానో ఇష్టపడదని తెలిపారు.

Key Points

1

రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ తన గుర్తింపు గురించి మాట్లాడింది.

2

ఆమె కేవలం 'రాజ్ కుమార్ రావు భార్య'గా పిలువబడటాన్ని ఇష్టపడదని వెల్లడించింది.

4

తనను వ్యక్తిగతంగా కాకుండా, భర్తను సంప్రదించడానికి మాత్రమే చాలామంది సంప్రదిస్తున్నారని ఆమె అన్నారు.

పత్రలేఖ ఎమోషనల్ కామెంట్స్

బాలీవుడ్‌లో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao) ఒకరు. ‘స్త్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2’ తదితర చిత్రాలతో ప్రజెంట్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు ఈ హీరో. అయితే.. హీరో రాజ్ కుమార్ రావు వైఫ్ పత్రలేఖ (Patralekhaa) కూడా హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ రీసెంట్‌గా ‘ఫూలే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా జ్యోతీబా ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే జీవితాల ఆధారంగా తెరకెక్కగా.. ఇందులో ప్రతీక్ గాంధీ జ్యోతిబా ఫూలే పాత్రలో, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలే పాత్రలో నటించి మెప్పించారు. అయితే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పత్రలేఖ.. తన భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘కేవలం రాజ్‌కుమార్ భార్య అని పిలుపించుకోవడం నాకు నచ్చదు. ఒక్కోసారి నేను దానిని నిజంగా ద్వేషిస్తాను. అంతే కాకుండా నేను చిన్నదాన్ని అనే ఫీలింగ్ వస్తుంది. నటిగా నాకు ఒక పేరు ఉంది.. నాకు ఒక గుర్తింపు ఉంది. అలా పిలవకుండా ఎక్కువగా రాజ్ కుమార్ వైఫ్‌గా మాత్రమే నన్ను గుర్తిస్తారు. ఫ్యాన్స్ చాలా మంది కూడా ఆయనను చేరుకోవడానికి మాత్రమే నన్ను సంప్రదిస్తారు’ అంటూ తనకు వ్యక్తిగత గుర్తింపు దక్కడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

‘ఫూలే’ సినిమా విజయం

వృత్తిపరమైన గుర్తింపు కోసం పోరాటం

తన వృత్తి జీవితంపై, గుర్తింపుపై పత్రలేఖ చేసిన వ్యాఖ్యలు చాలా మందిలో ఆలోచనలకు దారితీశాయి. నటిగా ఆమెకున్న ప్రతిభను గుర్తించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.