
బాలీవుడ్ నటుడు రాజ్ కుంద్రా స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ కి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, ఇది కేసు కప్పిపుచ్చుకోవడానికి చేసిన పబ్లిసిటీ స్టంట్ అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై రాజ్ కుంద్రా స్పందించారు.
Key Points
రాజ్ కుంద్రా స్వామీజీకి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు.
చాలామంది దీన్ని పబ్లిసిటీ స్టంట్ అని అభిప్రాయపడుతున్నారు.
రాజ్ కుంద్రా ఈ విమర్శలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కిడ్నీ దానం ఆఫర్
మంచి చేయాలనుకుంటే అందులో కూడా చెడే చూస్తున్నారంటున్నాడు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రా ( Raj Kundra ). స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ఈయన స్వామికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
కరుణ కూడా పీఆర్ స్టంటా? అయితే చాలామంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేస్తున్నారు. తనపై ఉన్న కేసులను కప్పిపుచ్చడానికే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై రాజ్ కుంద్రా అసహనం వ్యక్తం చేశాడు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కోసం నా కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడితే దాన్ని కూడా తప్పుపడుతున్నారు. పీఆర్ స్టంట్ అని తీసిపారేస్తున్నారు. ఇలాంటి వింత ప్రపంచంలో ఉంటున్నాం! కరుణ, జాలి అనేవి స్టంట్ అయితే.. ప్రపంచమంతా అది వ్యాపించాలి.
పబ్లిసిటీ స్టంట్ విమర్శలు
వీలైతే ప్రేమించండి మానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారు. మానవత్వాన్ని స్ట్రాటజీ అని భావిస్తుంటే.. మీరందరూ దాన్ని ఫాలో కావాలి. మీ మెప్పు పొందడం కోసమైతే నేనలా మాట్లాడలేదు. మీ మాటలు, విమర్శలతో నా వ్యక్తిత్వం మారదు. వీలైతే ప్రేమించండి, అంతేకానీ, చులకనగా మాట్లాడకండి.. అప్పుడే ఇతరుల జీవితాల్లో మీరూ వెలుగులు నింపగలరు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
కిడ్నీ ఆఫర్.. తిరస్కరించిన స్వామీజీ కాగా ప్రేమానంద్ మహారాజ్ దశాబ్దకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. బృందావన్ ఆశ్రమంలో స్వామీజీని కలిసిన రాజ్‌కుంద్రా.. నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే అంటూ అవయవదానానికి ఆఫర్ ఇచ్చాడు. కానీ స్వామీజీ అందుకు నిరాకరించారు. రాజ్‌కుంద్రా కిడ్నీ ఆఫర్ చేసిన సమయంలో శిల్పా శెట్టి భర్త పక్కనే కూర్చుంది.
రాజ్ కుంద్రా స్పందన
రాజ్ కుంద్రా మంచి చేయాలనుకున్నా విమర్శలను ఎదుర్కొంటున్నారు. మంచిని కూడా ప్రశ్నించే ఈ ప్రపంచంలో మానవత్వం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

