|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Published: 10-04-2026, 8:05 AM
షాకింగ్: రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీతో సంచలనం.. ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న యంగ్ హీరో!
  • విజయ్ మిల్టన్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటలకు టీజర్ విడుదల!
  • తెలుగులో హరీష్ శంకర్, తమిళంలో ఏఆర్ మురుగదాస్ చేతుల మీదుగా టీజర్ లాంచ్.. ఇద్దరు టాప్ డైరెక్టర్లు సపోర్ట్!
  • సునీల్ వేదన్, భారత్, అభిరామి, కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీ.. భారీ అంచనాలు!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కోలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కోలీవుడ్‌లో రాజ్ తరుణ్ సత్తా చాటుతాడా?

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, బాక్సాఫీస్ వద్ద వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కొత్త ప్రయత్నాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘పాంచ్ మినార్’ సినిమాతో పలకరించిన ఈ హీరో, ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఏకంగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ తన తదుపరి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయగా.. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్ వేదన్, భారత్ అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

టీజర్ రిలీజ్.. ఇద్దరు స్టార్ డైరెక్టర్లు!

ఈక్రమంలో.. తాజాగా చిత్రబృందం ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటలకు ఈ ట్రైజర్ పేరుతో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ టీజర్‌ను తెలుగులో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ లాంచ్ చేయనుండగా, తమిళంలో స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరు అగ్ర దర్శకులు రాజ్ తరుణ్ సినిమా కోసం ముందుకు రావడం విశేషం. వరుస డిజాస్టర్ల తర్వాత రాజ్ తరుణ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తమిళ ఫ్లేవర్‌తో సాగే ఈ విభిన్న కథా చిత్రం ఆయన కెరీర్‌కు కచ్చితంగా బ్రేక్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ అందుకుని రాజ్ తరుణ్ తమిళ ఇండస్ట్రీలో రాణిస్తాడా? లేక తెలుగులో డిజాస్టర్స్ పాలైనట్లుగా అక్కడ కూడా మెప్పించలేక వెనకడుకు వేస్తాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో హిట్ కొడతాడా?

A post shared by RoughNoteProductions (@roughnoteproductions)

రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో రాజ్ తరుణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.