
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర తన ఆసక్తికరమైన సినీ ప్రయాణాన్ని తెలియజేశారు. ఒక మెస్‌లో భోజనం చేస్తుండగా హీరో అవకాశం అనుకోకుండా వచ్చింది. కానీ ఆయన మొదటి సినిమా అనుకున్నట్లు సాగలేదు.
Key Points
మెస్‌లో భోజనం చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది.
స్టార్ హీరోయిన్ రేవతితో తొలి సినిమా.
సినిమా రిలీజ్ కాలేదు, కానీ రాఘవేంద్ర రావు గారు అవకాశం ఇచ్చారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విజయవంతమైన కెరీర్.
మెస్ నుండి సినిమా ప్రయాణం
Raja Ravindra : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు రాజా రవీంద్ర. హీరోగా కూడా మధ్యలో కొన్ని సినిమాలు చేసారు. చాలామంది హీరో, హీరోయిన్స్ కి మేనేజర్ గా కూడా బిజీగా ఉంటారు రాజా రవీంద్ర. అయితే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోగానే. అది కూడా స్టార్ హీరోయిన్ పక్కన. కానీ తీరా చూస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు.
తాజాగా సీనియర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఆహా కాకమ్మ కథలు షోకి రాగా తన కెరీర్ ఎలా మొదలైందో తెలిపాడు.
రేవతితో తొలి సినిమా విఫలం
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. చెన్నై లో కూచిపూడి నేర్చుకుందామని వెళ్ళాను. ఒక రోజు మెస్ లో తింటుంటే ఒకరు వచ్చి హీరోగా చేస్తావా అని సినిమా ఆఫీస్ కి తీసుకెళ్లారు. అప్పుడు డైరెక్టర్ లేరు. పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను. నా అసలు పేరు రమేష్. నెక్స్ట్ డే వెళ్లి నేనే రమేష్ రమ్మన్నారు అని డైరెక్టర్ ని కలిసాను. ఆయన అప్పటికే కృష్ణ లాంటి స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి ఉన్నారు. ఫస్ట్ సినిమానే హీరోయిన్ రేవతి పక్కన హీరోగా. రేవతి గారు అప్పటికే స్టార్ హీరోయిన్. ఆమె దగ్గరికి నన్ను తీసుకెళ్లి ఇతనే హీరో, మీకు ఓకేనా అని అడిగితే ఆవిడ ఓకే అన్నారు. సినిమా అయిపోయింది కానీ రిలీజ్ అవ్వలేదు. రాఘవేంద్రరావు గారు సినిమా చూసి ఆడదని అర్థమయి సైలెంట్ గా వెళ్లిపోయారు. రామానాయుడు గారికి సినిమా చూపించి రిలీజ్ చేయమని అడిగితే ఇది వర్కౌట్ అవ్వదు చేయను అన్నారు. కానీ ఆ అబ్బాయి బాగున్నాడు నా నెక్స్ట్ సినిమాలో వేషం ఇస్తాను అని సర్ప యాగం సినిమాలో వేషం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ వెనక్కి చూసుకోలేదు అని తెలిపారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విజయం
చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజా రవీంద్ర గారు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు. ఆయన తన అనుభవాలను ఆహా కాకమ్మ కథలు షోలో పంచుకున్నారు.


