
📌 Key Points
- రాజా రవివర్మ ‘యశోదా కృష్ణ’ చిత్రం రూ.167.2 కోట్లకు అమ్ముడుపోయింది.
- ఈ చిత్రం భారతీయ కళాఖండాల వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది.
- సైరస్ పూనావాలా ఈ అరుదైన చిత్రాన్ని సొంతం చేసుకున్నారు.
- కేవలం 7 నిమిషాల్లోనే ఈ పెయింటింగ్ భారీ ధర పలికింది.
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ వేసిన ‘యశోదా కృష్ణ’ చిత్రం సంచలనం సృష్టించింది. ముంబై వేలంలో ఈ చిత్రం ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ పూనావాలా సొంతం చేసుకున్నారు.
వేలంలో రికార్డు ధర పలికిన యశోదా కృష్ణ చిత్రం
భారతీయ చిత్రకళా చరిత్రంలో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ (Raja Ravivarma) సృష్టించిన గీసిన ‘యశోదా కృష్ణ’ (Yashoda and Krishna) తైలవర్ణ చిత్రం వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడై సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ముంబైలో జరిగిన ‘సాఫ్రన్ ఆర్ట్’ (Saffronart) స్ప్రింగ్ లైవ్ వేలంలో ఈ పెయింటింగ్ ఏకంగా రూ.167.20 కోట్లు పలికింది. ఇప్పటివరకు ఒక భారతీయ కళాఖండానికి వేలంలో లభించిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. గతంలో ఎం.ఎఫ్. హుస్సేన్ (M.F. Husain) గీసిన పెయింటింగ్ రూ.118 కోట్లు పేరిట ఉన్న రికార్డును ఇది బ్రేక్ చేసింది.
అయితే, ఈ అరుదైన రాజా రవివర్మ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా సొంతం చేసుకున్నారు. 1890వ దశకంలో రవివర్మ తన కళా ప్రస్థానంలో అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దీనిని చిత్రించారు. యశోదమ్మ ఆవు పాలు పితుకుతుండగా, వెనుక నుండి బాలకృష్ణుడు వచ్చి ఆమెను అతుక్కునే అందమైన దృశ్యాన్ని ఇందులో చూడవచ్చు. ఈ పెయింటింగ్‌ను నిపుణులు భారతీయ కళా ప్రపంచంలో ‘మోనాలిసా’గా అభివర్ణిస్తున్నారు. కేవలం 7 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ బిడ్డింగ్‌లో ప్రారంభ ధర రూ.80 కోట్లు కంటే రెట్టింపు ధరను దక్కించుకోవడం విశేషం.
సైరస్ పూనావాలా సొంతం చేసుకున్న అరుదైన కళాఖండం
భారతీయ కళా ప్రపంచంలో ‘మోనాలిసా’గా అభివర్ణన
రాజా రవివర్మ ‘యశోదా కృష్ణ’ చిత్రం వేలంలో రికార్డు ధర పలకడం భారతీయ కళా చరిత్రలో ఒక మైలురాయి. ఈ చిత్రం సైరస్ పూనావాలా చేతికి చేరడం విశేషం. ఇది కళాభిమానులకు గర్వకారణం.


