|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజా సాబ్: ప్రభాస్ మూవీకి షాక్.. 13వ రోజు కలెక్షన్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 22-01-2026, 6:05 AM
రాజా సాబ్: ప్రభాస్ మూవీకి షాక్.. 13వ రోజు కలెక్షన్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  • ప్రభాస్ ‘రాజా సాబ్’ 13వ రోజు కలెక్షన్లు: రూ. 48 లక్షలు మాత్రమే!
  • తొలి రోజు కలెక్షన్లు రూ. 62.9 కోట్లు, మొదటి వారాంతంలో రూ. 130.25 కోట్లు రాబట్టింది.
  • ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్లు వసూలు చేసిన ‘రాజా సాబ్’ మూవీ.
  • మారుతి దర్శకత్వంలో ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ సినిమా కలెక్షన్ల గురించి ఒక సంచలన వార్త! సినిమా విడుదలైన 13 రోజుల తర్వాత వసూళ్లు ఎలా ఉన్నాయి? అభిమానులు ఏమనుకుంటున్నారు? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

13వ రోజు కలెక్షన్ల వివరాలు

పాన్ ఇండియా  స్టార్ హీరో  ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’. ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. రాజాసాబ్ కు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. సినిమా నెమ్మదిగా 13 రోజులు థియేటర్లలో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 13వ రోజు కలెక్షన్ల వివరాలు ఏంటంటే?

sacnilk.com రిపోర్ట్ ప్రకారం, ‘ది రాజా సాబ్’ సినిమా 13వ రోజున రూ. 48 లక్షలు వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద సినిమా ఆట ముగిసినట్టే కనిపిస్తోంది. మరోవైపు,   సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్ సినిమా బాలీవడ్ లో నిలదొక్కుకోవడం మరింత కష్టమవుతుంది.

తగ్గిన వసూళ్లు.. కారణాలేంటి?

‘ది రాజా సాబ్’ మొదటి రోజు రూ. 62.9 కోట్లు వసూలు చేసింది. తర్వాత వసూళ్లు తగ్గాయి. మొదటి వారాంతంలో ఈసినిమా రూ. 130.25 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియాలో రూ. 141.98 కోట్లు సంపాదించింది ప్రభాస్ మూవీ.

‘ది రాజా సాబ్’ సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్ రూ. 201 కోట్లు. జనవరి 21న తెలుగు ఆక్యుపెన్సీ 14.29%గా ఉంది. ఉదయం షోలకు 15.02%, మధ్యాహ్నం 12.81%, సాయంత్రం 14.63%, రాత్రి 14.7% ఆక్యుపెన్సీ నమోదైంది.

ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ!

‘ది రాజా సాబ్’ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీశారు. కానీ 13 రోజులైనా రూ. 150 కోట్ల మార్కును దాటలేదు. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. లక్షలు వసూలు చేయడం కూడా కష్టంగా మారింది. ప్రభాస్ అభిమానులు ఈ విషయంలో ఎంతో నిరాశతో ఉన్నారు.

‘ది రాజా సాబ్’ ఒక ఫాంటసీ హారర్ కామెడీ సినిమా. మారుతి దర్శకత్వం వహించిన ఈసినిమాలో . ప్రభాస్‌ జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్  నటించారు. సంజయ్ దత్ ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించాడు.

రాజా సాబ్ కలెక్షన్ల గురించి తాజా సమాచారం ఇది. సినిమా భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.