|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘రాజా సాబ్’-! 4 రోజుల్లో ఊహించని కలెక్షన్లు! బాక్సాఫీస్ బద్దలు!

Updated: 13-01-2026, 8:19 AM
ప్రభాస్ 'రాజా సాబ్' విధ్వంసం! 4 రోజుల్లో ఊహించని కలెక్షన్లు! బాక్సాఫీస్ బద్దలు!
  • ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీకి మొదటి రోజు భారీగా 53.75 కోట్ల కలెక్షన్లు!
  • మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది రాజా సాబ్’ సినిమా సంచలనం!
  • ప్రపంచవ్యాప్తంగా ‘రాజా సాబ్’ సినిమా రూ. 188.4 కోట్ల వసూళ్లు సాధించింది.
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో 450 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులు సృష్టిస్తోంది. సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్దాం.

రాజా సాబ్ మొదటి రోజు కలెక్షన్ల మోత!

పాన్ ఇండియా హీరో  ప్రభాస్, కామెడీ సినిమాల దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన సనిిమా  ‘ది రాజా సాబ్.’ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజయిన ఈ సినిమా చూశాక.. చాలామంది కథ బలహీనంగా ఉందని విమర్శించారు. ప్రభాస్ లాంటి స్టార్ ఇలాంటి సినిమా ఎలా చేశారని అన్నారు.

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మొదటి సోమవారం కలెక్షన్ల వివరాలు బయటకు  వచ్చాయి. sacnilk.com ప్రకారం, ఈ సినిమా 6.6 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 114.6 కోట్లు సంపాదించింది రాజాసాబ్ సినిమా.

100 కోట్ల క్లబ్‌లో ప్రభాస్ సినిమా రికార్డు

ప్రభాస్ రాజాసాబ్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మంచి స్పందన రావడంతో..  53.75 కోట్లు, రెండో రోజు భారీగా తగ్గి 26 కోట్లు, మూడో రోజు 19.1 కోట్ల వసూలు చేసింది. కలెక్షన్లు తగ్గినప్పటికీ, సినిమా 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ప్రపంచవ్యాప్తంగా రాజా సాబ్ వసూళ్ల ప్రభంజనం

‘ది రాజా సాబ్’ సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్ చూస్తే, ఇప్పటివరకు 188.4 కోట్లు సంపాదించింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 137.00 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో 31.80 కోట్లు వసూలు చేసింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ హారర్ కామెడీ సినిమాను… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ450 కోట్ల బడ్జెట్ తో  నిర్మించింది. ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో నటించారు.

ప్రభాస్ రాజా సాబ్ సినిమా కలెక్షన్ల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.