
📌 Key Points
- వింటేజ్ ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా! పూనకాలు లోడింగ్!
- తమన్ బీజీఎమ్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి, హారర్ సీన్స్ అదిరిపోయాయి!
- మాళవిక ఫైట్స్ అదుర్స్, నిధి, రిద్ధి గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్!
- సంజయ్ దత్ ఊహించని పాత్రలో కనిపించి షాక్ ఇచ్చాడు!
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాపై ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ఫ్యాన్స్ కి మాత్రం పండగే పండగ అంటున్నారు!
ట్విట్టర్‌లో ది రాజా సాబ్ రివ్యూ అదుర్స్!
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్ ట్విటర్ రివ్యూపై లుక్కేద్దాం.
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఎట్టకేలకు వెండితెరపై సందడి చేస్తోంది. ‘కల్కి 2898 AD’ లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తిగా భిన్నమైన హారర్ కామెడీ జానర్‌లో కనిపించడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.
వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్! ఫ్యాన్స్ పండగ!
ఇవాళ (జనవరి 9) థియేటర్లలో ది రాజా సాబ్ రిలీజ్ కానుండగా.. ఈపాటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్ ట్విటర్ రివ్యూ లోకి వెళితే..!
“ఫస్టాఫ్ అదిరిపోయింది. మాళవిక ఫైట్ బాగుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. తమన్ బీజీఎమ్ భయపెట్టింది. ప్రభాస్‌ను ఇలా చూపించినందుకు డైరెక్టర్ మారుతి కి థ్యాంక్స్” అని ఒకరు రాసుకొచ్చారు.
థియేటర్లలో తమన్ బీజీఎమ్ మోత మోగిపోతుంది!
“ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. తమన్ సంగీతం సీన్స్‌కు ఎలివేట్ ఇచ్చింది. హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ స్టన్నింగ్‌గా కనిపించారు. ఎవ్వరూ ఊహించని పాత్ర ది రాజా సాబ్‌లో ఉంది. సంజయ్ దత్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది. హారర్ సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది” అని ఒకరు రివ్యూ ఇచ్చారు.
ఇలా ది రాజా సాబ్‌పై చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామర్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందని అంటున్నారు.
ది రాజా సాబ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


